Share News

అమెరికాలో ఇరాన్‌ నేతల బంధువుల అరెస్టు

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:48 AM

లో నివసిస్తున్న ఇరాన్‌ కీలక నేతల బంధువులపై అమెరికా దృష్టిపెట్టింది. వారి చట్టబద్ధ హక్కులను రద్దు చేసి అరెస్టులు చేస్తోంది...

అమెరికాలో ఇరాన్‌ నేతల బంధువుల అరెస్టు

చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న ఇరాన్‌ కీలక నేతల బంధువులపై అమెరికా దృష్టిపెట్టింది. వారి చట్టబద్ధ హక్కులను రద్దు చేసి అరెస్టులు చేస్తోంది. శనివారం ఐఆర్‌జీసీ మాజీ కమాండర్‌ ఖసేమ్‌ సోలేమానీ మేనకోడలు హమీదా అఫ్షర్‌, ఆమె కుమార్తెకు ఉన్న గ్రీన్‌కార్డును రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటించారు. ఇరాన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వారిని అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఇరాన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మాజీ చీఫ్‌ లారిజాని కుమార్తె ఫాతిమా, ఆమె భర్త సయ్యద్‌ మొతామెదీ నివాస హోదాను కూడా రద్దు చేసి, అరెస్టు చేసినట్టు రూబియో తెలిపారు.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 06:49 AM