ఉగ్రకుట్ర అనుమానాలు యూకే నుంచి బీ1 బాంబర్ల తరలింపు
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:02 AM
యూకేలోని రాయల్ ఎయిర్‌ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా తన డజనుకు పైగా బీ1 బాంబర్ విమానాలతో పాటు ఇతర వ్యూహాత్మక బాంబర్లను కూడా స్వదేశానికి తరలించింది.
డజనుకు పైగా విమానాలను
స్వదేశానికి తరలించిన అమెరికా
లండన్, అక్టోబరు 5: యూకేలోని రాయల్ ఎయిర్‌ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా తన డజనుకు పైగా బీ1 బాంబర్ విమానాలతో పాటు ఇతర వ్యూహాత్మక బాంబర్లను కూడా స్వదేశానికి తరలించింది. ఎయిర్ బేస్ సమీపంలో ఇటీవల అనుమానాస్పదంగా ఇంధన ట్యాంకర్లు కనిపించడం, ఎయిర్ బేస్‌పై ఉగ్రదాడి కుట్రలో భాగంగానే అక్కడ ఆ ట్యాంకర్లను పెట్టారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బాంబర్లను అక్కడ ఉంచడం సురక్షితం కాదని భావించి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్ర కుట్ర హెచ్చరికలతో పోలీసులు ఐదుగురిని అరెస్టు కూడా చేశారు. దీని వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో, యూకే రక్షణ వర్గాల పర్యవేక్షణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా తన బాంబర్ విమానాలను స్వదేశానికి తరలించింది. అయితే, ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. యూకేలోని ఈ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్ పశ్చిమాసియాలో అమెరికా ఆపరేషన్లకు అత్యంత కీలకమైనది. ఇటీవలి కాలంలో ఇరాన్‌పై దాడులకు అమెరికా ఈ ఎయిర్‌బే్‌సను కూడా ఉపయోగించుకుంది
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్