Share News

పెను విషాదం.. పెంపుడు కుక్క కారణంగా కాళ్లు, చేతులు..

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:52 PM

లండన్‌కు చెందిన ఓ మహిళ జీవితం పెంపుడు కుక్క కారణంగా తలకిందులైంది. శరీరంపై అయిన చిన్న గాయాన్ని కుక్క నాకడం వల్ల ఆమె సెస్పిస్‌కు గురైంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలై కాళ్లు, చేతులు కోల్పోయింది.

పెను విషాదం.. పెంపుడు కుక్క కారణంగా కాళ్లు, చేతులు..
sepsis from dog lick

ఇంటర్‌నెట్ డెస్క్: పెంపుడు కుక్క కారణంగా ఓ మహిళ జీవితం తలకిందులు అయిపోయింది. శరీరంపై అయిన చిన్న గాయాన్ని కుక్క నాకడం వల్ల ఆమె సెస్పిస్‌కు గురైంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలై.. కాళ్లు, చేతులు కోల్పోయింది. 32 వారాల పాటు ఆస్పత్రిలో నరకం చూసింది. ఈ సంఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


2025 జులై నెలలో లండన్‌కు చెందిన మంజిత్ సంఘా అనే మహిళకు చిన్న గాయం అయింది. శనివారం కుక్కతో ఆడుకుంటున్న సమయంలో అది ఆమె గాయాన్ని నాకింది. దీంతో ఆమెకు సెస్పిస్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ ఆమె శరీరంపై వాయు వేగంతో ప్రభావం చూపసాగింది. ఆదివారం రోజు ఆఫీస్‌కు వెళ్లిన ఆమె.. ఆరోగ్యం బాగోలేకపోవటంతో మధ్యాహ్నమే ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి పరిస్థితి విషమించింది. రాత్రికి మంజిత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాళ్లు చేతులు చల్లగా అయిపోయాయి. పెదాల రంగు మారిపోయింది. ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బందిపడసాగింది. దీంతో భర్త కమల్‌జిత్ ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స అందించారు. సెస్పిస్ కారణంగా ఇన్ఫెక్ట్ అయిన కాళ్లు, చేతులను సగం వరకు తొలగించారు.


ఆస్పత్రిలో ఆమె 32 వారాల పాటు ఉంది. ఈ సమయంలో ఆరు సార్లు ఆమెకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడింది. తాజాగా.. మంజిత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు అస్సలు అర్థం కావటం లేదు. కేవలం 24 గంటల్లో ఇంత దారుణంగా ఎలా జరుగుతుంది. శనివారం తను కుక్కతో ఆడుకుంది. ఆదివారం డ్యూటీకి వెళ్లింది. సోమవారం రాత్రి కోమాలోకి వెళ్లిపోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి

పూరీలు చేయడం ఇంత ఈజీనా.. ఇతడి అతి తెలివి చూస్తే.. వావ్ అనాల్సిందే..

నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ

Updated Date - Feb 22 , 2026 | 06:00 PM