Share News

యూకేలో బాలికపై 700 మంది అత్యాచారం

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:24 AM

యూకేలో శ్వేతజాతి బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ‘గ్రూమింగ్‌ గ్యాంగులు (మాయమాటలు చెప్పి బాలలను లొంగదీసుకుని లైంగిక దోపిడీ చేసే ముఠాలు)’ సాగిస్తున్న దారుణ అత్యాచారాల గురించి...

యూకేలో బాలికపై 700 మంది అత్యాచారం

  • మూడేళ్లపాటు గ్రూమింగ్‌ గ్యాంగ్‌ ఘాతుకం

  • బాధితుల వాంగ్మూలాలను పార్లమెంటు సాక్షిగా చదివి వినిపించిన బ్రిటిష్‌ ఎంపీ

  • ఆ ముఠాల్లో ఎక్కువ మంది పాక్‌ జాతీయులే

లండన్‌, జూన్‌ 2: యూకేలో శ్వేతజాతి బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ‘గ్రూమింగ్‌ గ్యాంగులు (మాయమాటలు చెప్పి బాలలను లొంగదీసుకుని లైంగిక దోపిడీ చేసే ముఠాలు)’ సాగిస్తున్న దారుణ అత్యాచారాల గురించి బ్రిటిష్‌ ఎంపీ రూపర్ట్‌ లోవ్‌.. ఆ దేశ పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. గ్రూమింగ్‌ గ్యాంగులు చేస్తున్న దారుణాలపై తాను నిర్వహించిన స్వతంత్ర విచారణలో.. పలువురు బాలికలు, యువతులు ఇచ్చిన వాంగ్మూలాలను సహచర ఎంపీల దృష్టికి తీసుకొచ్చారు. 13 ఏళ్ల వయసు నుంచి మొదలుపెట్టి.. ఆ తర్వాత మూడేళ్లలో దాదాపు 600 నుంచి 700 మంది దాకా అత్యాచారం చేశారంటూ ఓ బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం సహా పలువురు బాధితుల స్టేట్‌మెంట్లను ఆయన సభలో చదివి వినిపించారు. ఈ గ్యాంగుల్లో ఎక్కువ మంది పాకిస్థాన్‌ సంతతికి చెందినవారేననిఆయన తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ముఠాలు దారుణాలకు పాల్పడుతున్నాయని.. వాటి కార్యకలాపాలు ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. బాధితులను కాపాడడంలో అధికారులు, ఆరోగ్య సిబ్బంది దారుణంగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.


12 ఏళ్ల పిల్లలపైనా..

గ్రూమింగ్‌ గ్యాంగులు తాము లక్ష్యంగా చేసుకున్న అమ్మాయిలను అవమానించడానికి, వారిని అవమానభారంతో కుంగిపోయేలా చేసి తమ అదుపులో పెట్టుకోవడానికి మతాన్ని ఉపయోగించేవారని రూపర్ట్‌లోవ్‌ చెప్పారు. తనపై లైంగిక దాడికి పాల్పడినవారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నట్టు ఒక బాధితురాలు చెప్పిన విషయాన్ని ఆయన వెల్లడించారు. 15-20 మంది అమ్మాయిలను బోనులో బందించి ఉంచడాన్ని తాను చూశానంటూ ఒక బాధితురాలు చెప్పిన విషయాన్ని తెలిపారు. పార్లమెంటులో ఆయన వినిపించిన కొందరి వాంగ్మూలాలు..

  • ముస్లిం బాలికలకు గౌరవం, ఉన్నత నైతిక ప్రమాణాలు ఉంటాయని వారు మాతో పదేపదే అనేవారు. మాపై చేసే అకృత్యాలను సమర్థించుకోవడానికి పదేపదే ఈ పోలికలు తెచ్చేవారు.

  • నేను క్రైస్తవురాలిగా పెరిగాను. నాకు ఎంతో ప్రత్యేకమైన శిలువ ధరించేదాన్ని. కానీ, వారు నన్ను మానసికంగా కుంగదీయడానికి దాన్నే ఒక సాధనంగా వాడుకున్నారు. ‘‘ఏడీ నీ దేవుడు.. నీ దేవుడు నిన్ను వదిలేశాడా?’’ అని ప్రశ్నించేవారు.

  • ఈద్‌, ఇతర సెలవు దినాల్లో పరిస్థితులు ఇంకా ఘోరంగా మారుతాయి. పార్టీలు చాలా పెద్దగా, దారుణంగా, మరింత హింసాత్మకంగా జరుగుతాయి.

..వీటితోపాటు గ్రూమింగ్‌ గ్యాంగులు సాగించిన అకృత్యాల్లో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే మరికొన్ని ఘటనల తాలూకూ వివరాలనూ ఆయన తెలిపారు. వీటన్నింటికీ అడ్డుకట్ట పడాలని.. మరే బాలికకు, మహిళకూ ఇలాంటివి జరగకూడదని విజ్ఞప్తి చేశారు. దీనిపై చర్చలతో సరిపెట్టకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 06:24 AM