Share News

సౌదీకి యూకే సైనిక సాయం

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:22 AM

ఇరాన్‌ అనుకూల హుతీల దాడులను ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియాకు పరిమిత స్థాయిలో సైనిక సాయం చేయనున్నట్టు యూకే ప్రధాని ఆండీ బర్న్‌హమ్‌ వెల్లడించారు. సౌదీ యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపేందుకు (రీఫ్యూయలింగ్‌) యూకే రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ తోడ్పడుతుందని తెలిపారు.

సౌదీకి యూకే  సైనిక సాయం
uk pm

  • యూకే ప్రధాని ఆండీ బర్న్‌హమ్‌ వెల్లడి

లండన్‌, సెప్టెంబరు 22: ఇరాన్‌ అనుకూల హుతీల దాడులను ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియాకు పరిమిత స్థాయిలో సైనిక సాయం చేయనున్నట్టు యూకే ప్రధాని ఆండీ బర్న్‌హమ్‌ వెల్లడించారు. సౌదీ యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపేందుకు (రీఫ్యూయలింగ్‌) యూకే రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ తోడ్పడుతుందని తెలిపారు. ఈ మేరకు ఒప్పందం కుదిరిందని.. హుతీల డ్రోన్‌, క్షిపణి దాడుల నుంచి రక్షించుకునేందుకు సౌదీకి ఈ సాయం చేస్తున్నట్టు చెప్పారు. కొన్నివారాలపాటు ఈ ఒప్పం దం అమల్లో ఉంటుందని, పరిస్థితిని బట్టి దీన్ని సమీక్షిస్తామని తెలిపారు.

మా విమానాలు యథావిధిగా తిరుగుతాయి: ఇరాన్‌

హోర్ముజ్‌ జలసంధిని తెరవకపోతే అంతర్జాతీయంగా ఇరాన్‌ వైమానిక కార్యకలాపాలను అడ్డుకుంటామని.. ఇరాన్‌ విమానయాన సంస్థలకు సేవలు అందించే విదేశీ కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బసెంట్‌ హెచ్చరించారు. బుధవారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి తెస్తామని ప్రకటించారు. అయితే తమ అంతర్జాతీయ విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఇరాన్‌ పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇరాన్‌ విమానయాన షెడ్యూళ్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఏవైనా మార్పులు ఉంటే ముందస్తుగా సమాచారం అందిస్తామని విమానయాన సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

ఈ వార్తలను చదవండి

అమెరికాలో వందల విమానాలు రద్దు.. కమ్యూనికేషన్ కేబుల్ తెగిపోవడమే కారణం

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు.

Updated Date - Sep 23 , 2026 | 04:22 AM