Share News

అమెరికాను దెబ్బ తీసిన ఇరాన్.. రూ. 2 వేల కోట్ల రాడార్ సిస్టమ్ ధ్వంసం..

ABN , Publish Date - Mar 07 , 2026 | 02:53 PM

ఇరాన్ తన శత్రుదేశం అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. జోర్డాన్‌లోని అత్యంత ఖరీదైన రాడార్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్‌మెంట్‌ ధ్వంసం అయింది.

అమెరికాను దెబ్బ తీసిన ఇరాన్.. రూ. 2 వేల కోట్ల రాడార్ సిస్టమ్ ధ్వంసం..
Iran Israel War

న్యూయార్క్, మార్చి 7: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. మిస్సైల్స్ దాడులతో చుక్కలు చూపిస్తున్నాయి. అయినా కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. రెండు దేశాలకు గట్టి సమాధానం చెబుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా ఎయిర్ బేస్‌లు ఉన్న అరబ్ దేశాలపై కూడా మిస్సైల్స్, డ్రోన్స్‌తో దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల కారణంగా అరబ్ దేశాలు తీవ్ర నష్టాలపాలవుతున్నాయి.


అమెరికాకు ఊహించని దెబ్బ..

ఇరాన్ తన శత్రుదేశం అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. జోర్డాన్‌లోని అత్యంత ఖరీదైన రాడార్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. యూఎస్ థాడ్ డిఫెన్స్ సిస్టమ్.. ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్‌మెంట్‌ను ఉపయోగిస్తోంది. ఈ రాడార్ సిస్టమ్ ధర 300 మిలియన్ డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2,758 కోట్ల రూపాయలు. ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్‌మెంట్‌ జోర్డాన్‌లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్‌లో ఉంది.


యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్‌మెంట్‌ ధ్వంసం అయింది. ఈ విషయాన్ని అమెరికా తాజాగా, అధికారికంగా ధ్రువీకరించింది. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ థింక్ టాంక్ డైరెక్టర్ రయాన్ బ్రోబ్‌స్ట్ స్పందిస్తూ.. ‘ఇరాన్ ఫిబ్రవరి 28వ తేదీన, మార్చి 3వ తేదీన జోర్డాన్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్ని అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పటికి లాభం లేకుండాపోయింది. ఇరాన్ దాడుల్లో ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్‌మెంట్‌ ధ్వంసం అయింది. అయితే, అమెరికాతో పాటు దాని భాగస్వాముల దగ్గర ఇటువంటి రాడార్ సిస్టమ్‌లు ఇంకా చాలా ఉన్నాయి. ఒకదాన్ని కోల్పోవటం వల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

6 రోజులుగా ‘ఆఫ్‌లైన్‌’లో ఇరాన్‌!

ఇరాన్‌ లీడర్‌ ఎన్నికలో నేను జోక్యం చేసుకోవాల్సిందే!

Updated Date - Mar 07 , 2026 | 03:40 PM