Share News

హోర్ముజ్ జలసంధి దాటాలంటే రూ.18 కోట్లు టోల్ ఫీజు.. ఖండించిన ఇరాన్..

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:28 PM

హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే ఒక్కో సరకు రవాణా నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) చొప్పున వసూలు చేసేందుకు ఇరాన్‌ సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇరాన్ స్పందించింది.

హోర్ముజ్ జలసంధి దాటాలంటే రూ.18 కోట్లు టోల్ ఫీజు.. ఖండించిన ఇరాన్..
Iran Strait of Hormuz news

హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే ఒక్కో సరుకు రవాణా నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) చొప్పున వసూలు చేసేందుకు ఇరాన్‌ సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇరాన్ స్పందించింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ వార్తలపై స్పందిస్తూ.. అవన్నీ అసత్యాలని కొట్టిపడేసింది. నిరాధార ఆరోపణలను నమ్మవద్దని సూచించింది (Iran denies $2 million fee).


సరుకు రవాణా నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, అది ఇరాన్ ప్రభుత్వ అధికారిక వైఖరిని సూచించదని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 'యుద్ధం చేయాలంటే నిధులు కావాలి. కాబట్టి హోర్ముజ్ మీదుగా వెళ్లే సరుకు రవాణా నౌకల నుంచి మేము చార్జీలు తీసుకోక తప్పదు' అని ఇరాన్ చట్టసభల సభ్యుడు ఒకరు స్వయంగా వెల్లడించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి (Hormuz shipping charges controversy).


పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ మార్గాన్ని ఇరాన్ మూసివేసింది (Iran Strait of Hormuz news). ఈ మూసివేత కేవలం శత్రువులకేనని, మిత్ర దేశాలకు కాదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పినప్పటికీ, చాలా దేశాల నౌకలు ఆ మార్గం గుండా వెళ్లడానికి ముందుకు రావడం లేదు. కాగా, భారత్‌కు చెందిన కొన్ని నౌకలు ఇటీవల హోర్ముజ్ మీదుగా స్వదేశానికి చేరుకున్నాయి. ఒక పాక్ నౌకకు కూడా ఇటీవల అనుమతి లభించినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించిన ఇరాన్..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 23 , 2026 | 04:28 PM