Share News

ట్రంప్‌ పోస్టులకు నెలకు 96 లక్షలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 05:59 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో చేసే పోస్టులకు ఆ కంపెనీ ధరలను ప్రకటించింది. ట్రూత్‌ సోషల్‌ యాప్‌లో యూజర్లకు...

ట్రంప్‌ పోస్టులకు నెలకు 96 లక్షలు

  • 8 ట్రూత్‌ ఏపీఐ సబ్‌స్ర్కిప్షన్‌ ధరలను వెల్లడించిన ట్రూత్‌ సోషల్‌

  • 8 టాప్‌ 10 ప్రముఖుల పోస్టులకు

స్థాయిని బట్టి నెలకు 60 వేల నుంచి లక్ష డాలర్లు

వాషింగ్టన్‌, జూలై 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో చేసే పోస్టులకు ఆ కంపెనీ ధరలను ప్రకటించింది. ట్రూత్‌ సోషల్‌ యాప్‌లో యూజర్లకు కనిపించటానికి ముందే ఆ పోస్టులను తెలుసుకోవాలనుకునే వారు నెలకు లక్ష డాలర్లు (దాదాపు రూ.96 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ఆదివారం ప్రకటించింది. ట్రంప్‌తోపాటు ట్రూత్‌ సోషల్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్‌ 10 మంది ప్రముఖుల పోస్టులను ముందుగానే పొందాలంటే.. ఆ ప్రముఖుల స్థాయిని బట్టి నెలకు 60 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు చెల్లించి ట్రూత్‌ ఏపీఐ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తాత్కాలిక సీఈవో కెవిన్‌ మెక్‌గర్న్‌ ప్రకటించారు. స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ కంపెనీలు, బ్యాంకులు, హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీలతోపాటు వ్యక్తులు కూడా ఈ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకోవచ్చని చెప్పారు. ట్రూత్‌ సోషల్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నది ట్రంప్‌కే. ఆయనను కోటీ 29 లక్షల మంది ఫాలో అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్‌ ఐదుగురిలో ట్రంప్‌ కుటుంబ సభ్యులే ముగ్గురు ఉన్నారు. మరోవైపు ట్రూత్‌ సోషల్‌ ఏపీఐతో ట్రంప్‌ కుటుంబానికే ప్రయోజనాలు ఉంటాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 05:59 AM