Share News

కాల్పుల విరమణ ముగిసింది.. కానీ చర్చలు కొనసాగుతాయి: ట్రంప్

ABN , Publish Date - Jul 10 , 2026 | 09:09 PM

ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం, కాల్పుల విరమణ కూడా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

కాల్పుల విరమణ ముగిసింది.. కానీ చర్చలు కొనసాగుతాయి: ట్రంప్
Trump Says US to Continue Iran Talks but Declares Ceasefire Is Over

వాషింగ్టన్, జులై 10: ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం(MoU) ముగిసిపోయిందని ప్రకటించిన రెండు రోజుల తర్వాత.. ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ(Ceasefire) కూడా ముగిసిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరాన్ అభ్యర్థన మేరకు శాంతి చర్చలను కొనసాగించేందుకు అమెరికా అంగీకరించిందని చెబుతూ ట్రంప్ భిన్నమైన సంకేతాలిచ్చారు.


'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ హెచ్చరిక

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన వల్లే చర్చలకు ఒప్పుకున్నామని, అయితే తమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 'చర్చలను కొనసాగించాలని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మమ్మల్ని కోరింది. అందుకు మేము అంగీకరించాం. కానీ, ఇరు దేశాల మధ్య ఉన్న 'కాల్పుల విరమణ' ఇక ముగిసిపోయినట్లేనని ఎలాంటి అస్పష్టత లేకుండా అమెరికా వారికి స్పష్టం చేసింది' అన్నారు.

Trump-post.jpg


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 10 , 2026 | 09:30 PM