Share News

వెంటిలేటర్‌పై ‘కాల్పుల విరమణ’: ట్రంప్‌

ABN , Publish Date - May 12 , 2026 | 04:47 AM

ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని, ఒకరకంగా అది వెంటిలేటర్‌పై ఉన్నట్లేనని...

వెంటిలేటర్‌పై ‘కాల్పుల విరమణ’: ట్రంప్‌

వాషింగ్టన్‌, మే 11: ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని, ఒకరకంగా అది వెంటిలేటర్‌పై ఉన్నట్లేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. సోమవారం ఓవల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇరాన్‌ ప్రతినిధులు పంపిన చెత్త (శాంతి ఒప్పంద ప్రతిపాదన)ను చదివిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం చాలా బలహీన స్థితిలో ఉన్నట్లు స్పష్టమైంది. ఇదంతా చూసి నేను అలసిపోతానని, ఒత్తిడికి లోనవుతానని వారు అనుకుంటున్నారు. కానీ, నాకు ఎలాంటి ఒత్తిడీ లేదు. మనం సంపూర్ణ విజయం సాఽధించబోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు సోషల్‌మీడియాలో ఆయన స్పందిస్తూ.. ఇరాన్‌ ప్రతిపాదించిన శాంతి ఒప్పంద ప్రణాళిక తనకు నచ్చలేదని తెలిపారు. ఆ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదనీయం కాదని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన ఆక్సియోస్‌ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘50 ఏళ్లుగా ఇరాన్‌ మాతో ఆటలాడుతోంది. ఇకపై వాళ్ల ముఖాల్లో నవ్వు ఉండదు’ అని అన్నారు. మరోవైపు ఇరాన్‌పై నిలిపివేసిన సైనిక చర్యను మళ్లీ ప్రారంభించాలని అఽధికార రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 12 , 2026 | 07:02 AM