శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:38 AM
ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
వాషింగ్టన్, ఆగస్టు 2: ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్, కొన్ని మధ్యప్రాచ్య దేశాల ప్రత్యేక అభ్యర్థన మేరకు తాము ఈ దాడులను వాయిదా వేసినట్లు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు.
ఆయన తన పోస్టులో.. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయి సైనిక శక్తితో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై విరుచుకుపడేందుకు అమెరికా సర్వం సిద్ధం చేసుకుంది. అయినప్పటికీ, ఒక ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలు ఖరారైనందున ఎలాంటి దాడి చేయవద్దని ఇరాన్, ఇతర మధ్యప్రాచ్య దేశాలు మమ్మల్ని అభ్యర్థించాయి. ఈ ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని తక్షణమే పూర్తి స్థాయిలో పునఃప్రారంభించడంతో పాటు, అణు ముప్పుకు ఇరాన్ ముగింపు పలకాల్సి ఉంటుంది’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
బోటు లేదు.. శిక్షణ లేదు.. 2 వేల ప్రాణాలు కాపాడిన శ్రావణ్..
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి