హోర్ముజ్‌ను స్వాధీనం చేసుకోండి.. సాయం చేస్తాం: ట్రంప్
ABN , Publish Date - Apr 02 , 2026 | 07:58 AM
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి తమకు ఆయిల్ అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. సముద్ర మార్గం నుంచి తమకు ఆయిల్ అక్కర్లేదని, భవిష్యత్తులో కూడా అవసరం ఉండదని తేల్చి చెప్పారు.
న్యూయార్క్, ఏప్రిల్ 2: స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి తమకు ఆయిల్ అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. సముద్ర మార్గం నుంచి తమకు ఆయిల్ అక్కర్లేదని, భవిష్యత్తులో కూడా అవసరం ఉండదని తేల్చి చెప్పారు. హోర్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్న దేశాలకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. ఆ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, స్వాధీనం చేసుకుని కాపాడుకోవాలని సూచించారు. ఈ విషయంలో అమెరికా తప్పకుండా సాయం చేస్తుందని అన్నారు.
గురువారం ఉదయం ట్రంప్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేను రెండు సలహాలు ఇస్తాను. ఒకటి.. అమెరికా దగ్గర ఆయిల్ పుష్కలంగా ఉంది. కాబట్టి మా దగ్గరి నుంచి ఆయిల్ కొనండి. రెండోది.. ఇకనైనా ధైర్యం తెచ్చుకుని స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ను స్వాధీనం చేసుకుని కాపాడుకోండి. ఈ పని మీరు ముందే చేయాల్సింది. మాతో పాటు కలిసి ఈ పని చేయాల్సింది. కలిసి రమ్మని కూడా అడిగాము. నేరుగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరకు వెళ్లండి. దాన్ని స్వాధీనం చేసుకుని కాపాడుకోండి’ అని అన్నారు.
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్
ఇరాన్‌తో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌లో పాలకవర్గం మార్పునకు ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. వియత్నాం యుద్ధం ముగియడానికి 19 ఏళ్లు పట్టిందని, అమెరికన్ల భవిష్యత్ కోసమే ఈ యుద్ధం చేస్తున్నామని అన్నారు. 2-3 వారాల్లో భీకరదాడులు చేస్తామని తెలిపారు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని వెల్లడించారు. గల్ఫ్ దేశాలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సౌదీ, కువైట్, బహ్రెయిన్‌కు భద్రత కల్పిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన స్పీచ్.. 'ఇరాన్ ఆపరేషన్'పై ట్రంప్ ప్రకటన
నేడు హనుమాన్ జయంతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు