Share News

బాంబుల కంటే దిగ్బంధం బాగుంది

ABN , Publish Date - May 01 , 2026 | 06:30 AM

అమెరికా దిగ్బంధాన్ని తొలగిస్తే.. హోర్ముజ్‌ జలసంధిని తెరుస్తామని, అణుకార్యక్రమం అంశంపై చర్చలను తర్వాత చేపడదామని ఇరాన్‌ ప్రతిపాదనను అమెరికా...

బాంబుల కంటే దిగ్బంధం బాగుంది

  • ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిలిపేయాల్సిందే: ట్రంప్‌

  • హోర్ముజ్‌ కాదు.. ట్రంప్‌ జలసంధి!

  • మ్యాప్‌ను షేర్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 30: అమెరికా దిగ్బంధాన్ని తొలగిస్తే.. హోర్ముజ్‌ జలసంధిని తెరుస్తామని, అణుకార్యక్రమం అంశంపై చర్చలను తర్వాత చేపడదామని ఇరాన్‌ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. ‘‘ఇరాన్‌పై బాంబు లు వేయడం కంటే దిగ్బంధం బాగుంది. ఇరాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్‌ అణు కార్యక్ర మం నిలిచిపోవాల్సిందే. వారి వద్ద అణ్వస్త్రాలు ఉండకూడదు’’ అని యాక్సియో్‌సకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసిన జర్మనీ చాన్సలర్‌ ఫ్రె డరిక్‌ మెర్జ్‌పై మరోసారి మండిపడ్డారు. ఇరాన్‌ అణుముప్పును తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తప్పుబట్టే బదులు.. జర్మనీ ఎదుర్కొంటున్న వ లస, ఇంధన సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. నాటోలో భాగంగా జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను ఉపసంహరించుకోనున్నట్టు తెలిపారు.

ఇరాన్‌ చమురు ట్యాంకర్ల జప్తునకు సిద్ధం!

హోర్ముజ్‌ జలసంధికి ట్రంప్‌ జలసంధిగా పేరుపెట్టిన ఒక మ్యాప్‌ను ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో షేర్‌ చేశారు. అవసరమైతే హోర్ముజ్‌ దిగ్బంధాన్ని కొన్ని నెలలపాటు సాగించేందుకు ట్రంప్‌ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ఆసక్తిగా మారింది. గతంలోనూ ట్రంప్‌ ఒకసారి హోర్ముజ్‌ను ట్రంప్‌ జలసంధి అంటూ పోస్టుపెట్టడం గమనార్హం. కాగా, అమెరికా అడ్డుకున్న రెండు ఇరాన్‌ చమురు ట్యాంకర్లను జప్తు చేసేందుకు ఆ దేశ న్యాయశాఖ సిద్ధమైనట్టు అధికారవర్గాలు తెలిపాయి. జప్తు ప్రక్రియ పూర్తయితే.. అమెరికా ఆ ట్యాంకర్లను, వాటిలోని చమురును స్వాధీనం చేసుకుంటుంది. సొంతంగా వినియోగించుకోవడానికి లేదా అమ్ముకోవడానికి చట్టపరంగా వీలుకలుగుతుంది.

ఇరాన్‌పై తీవ్రస్థాయిలో దాడికి ప్రణాళిక?

ఇరాన్‌పై అకస్మాత్తుగా, తీవ్రస్థాయిలో దాడి చేసేందుకు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్‌ వార్తాసంస్థ ఈ మేరకు కథనం ప్రచురించింది. స్వల్ప సమయంలోనే, అతి తీవ్రస్థాయిలో విరుచుకుపడాలని భావిస్తున్నారని.. సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్‌ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ ఈ అంశంపై ట్రంప్‌కు నివేదిక అందజేయనున్నట్టు తెలిసిందని పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 06:30 AM