ఉద్యోగం పోగానే అమెరికాను వీడాల్సిందే!
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:39 AM
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై మరో బాంబు వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు..ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం...
60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే పనిలో ట్రంప్
ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ప్రతిపాదన
హెచ్-1బీ వీసాదారులపై అమెరికా అధ్యక్షుడి మరో బాంబు
చదువైపోగానే తిరిగొచ్చేస్తాం.. 81% భారత విద్యార్థుల మాట
వాషింగ్టన్, ఆగస్టు 8: అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై మరో బాంబు వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు..ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం వెతుక్కొనేందుకు ప్రస్తుతం 60 రోజుల సమయం (గ్రేస్ పీరియడ్) ఇస్తున్నారు. ఈ గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంఽధించిన ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ)కి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపినట్లు సమాచారం. ఒకవేళ గ్రేస్ పీరియడ్‌ను ప్రభుత్వం రద్దుచేస్తే హెచ్-1బీ వీసాదారులకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇప్పటికే కొత్త హెచ్-1బీ వీసా ఫీజును ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పుడు గ్రేస్ పీరియడ్‌ను కూడా రద్దుచేస్తే ఉద్యోగం కోల్పోయిన వెంటనే ఈ వీసాదారులు వారి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో..విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో దాదాపు 81ు మంది తమ చదువు పూర్తికాగానే స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ సంస్థ సర్వేలో వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ