టైటానిక్ విషాదం.. వేలానికి ఆమెను కాపాడిన లైఫ్ జాకెట్..
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:05 AM
టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో ఇంగ్లాండ్‌కు చెందిన లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి కూడా ఉన్నారు. లైఫ్ జాకెట్ పుణ్యమా అని ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా, లారా ధరించిన లైఫ్ జాకెట్‌ను వేలం వేశారు.
లండన్, ఏప్రిల్ 19: టైటానిక్ నౌక 1912, ఏప్రిల్ 14వ తేదీన ప్రమాదవశాత్తు మంచు కొండను ఢీకొట్టింది. తర్వాత రెండు ముక్కలుగా విరిగి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1517 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 706 మంది ప్రాణాలతో బయటపడ్డారు. టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో ఇంగ్లాండ్‌కు చెందిన లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి కూడా ఉన్నారు. లైఫ్ జాకెట్ పుణ్యమా అని ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా, లారా ధరించిన లైఫ్ జాకెట్‌ను వేలం వేశారు.
పురాతన వస్తువులను వేలం వేసే హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ కంపెనీ శనివారం నిర్వహించిన వేలం పాటలో లారా ధరించిన లైఫ్ జాకెట్ ఏకంగా 6,70,000 పౌండ్లకు అమ్ముడుపోయింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాని ధర 8.39 కోట్ల రూపాయలు. ఆ లైఫ్ జాకెట్ అంత పెద్ద మొత్తం ధరకు అమ్ముడుపోవడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. టైటానిక్ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ వారు ధరించిన లైఫ్ జాకెట్‌లను ఇప్పటి వరకు వేలం వేయలేదు. మొదటిసారిగా లారా ధరించిన లైఫ్ జాకెట్‌ను శనివారం వేలం వేశారు.
ఈ లైఫ్ జాకెట్‌పై లారాతో పాటు లైఫ్ బోట్ 1లో ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న మరో ఎనిమిది మంది సంతకాలు ఉన్నాయి. ఈ కారణాలతోటే ఆ లైఫ్ జాకెట్ వేలం పాటలో 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక, ఇదే వేలం పాటలో టైటానిక్ లైఫ్ బోట్‌లోని సీట్ కుషన్‌ను కూడా వేలం వేశారు. ఆ సీట్ కుషన్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. 3,90,000 పౌండ్లు.. మన ఇండియన్ కరెన్సీలో అయితే 4.88 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.
ఇవి కూడా చదవండి
ఆసిమ్ మునీర్‌ను అమెరికన్లు నమ్మడం లేదా.. పాక్ పాత్రపై అగ్రరాజ్య మీడియాలో సందేహాలు..
గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి..