Share News

ఓపెన్‌ఏఐలో తెలుగోడి హవా

ABN , Publish Date - Jul 20 , 2026 | 05:53 AM

చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐలో తెలుగుతేజం ‘ఉదయ్‌ రుద్రరాజు’ కీలక పదవిలో సేవలందిస్తున్నారు. ఎలాన్‌మ్‌స్కకు చెందిన ఎక్స్‌ఏఐ నుంచి దాదాపు ఏడాది క్రితం ఓపెన్‌ఏఐలో...

ఓపెన్‌ఏఐలో తెలుగోడి హవా

  • ఏడాదిగా ఆ సంస్థలో ‘కంప్యూట్‌’

విభాగాధిపతిగా ఉదయ్‌ రుద్రరాజు సేవలు

  • ఇటీవలే చీఫ్‌ టెక్నాలజీ అధికారిగా హోదా

న్యూయార్క్‌, జూలై 19: చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐలో తెలుగుతేజం ‘ఉదయ్‌ రుద్రరాజు’ కీలక పదవిలో సేవలందిస్తున్నారు. ఎలాన్‌మ్‌స్కకు చెందిన ఎక్స్‌ఏఐ నుంచి దాదాపు ఏడాది క్రితం ఓపెన్‌ఏఐలో చేరిన ఉదయ్‌.. 12 నెలలుగా ఆ సంస్థలో ‘కంప్యూట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ విభాగాధిపతిగా బాధ్యత లు నిర్వర్తించారు. ఈ నెల (జూలై) మొదట్లో ఓపెన్‌ఏఐ ఆయన హోదాను సీటీవోగా మార్చ డం ద్వారా ఆయన బాధ్యతల పరిధిని, సంస్థలో ఆయన ప్రాముఖ్యాన్ని పెంచినట్లయింది. హైదరాబాద్‌లోని చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (సీబీఐటీ)లో బీఈ కంప్యూటర్‌ సైన్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటాలో కంప్యూటర్‌సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఉదయ్‌.. ‘ఈబే’, రాబిన్‌హుడ్‌ సంస్థల్లో దాదాపు చెరో ఆరేళ్లపాటు పనిచేశారు. అనంతరం మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐలో చేరి ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌’ విభాగాధిపతిగా సేవలందించారు. ఎక్స్‌ఏఐలో.. 2.5 లక్షల జీపీయూలతో కొలోసస్‌ సూపర్‌ కంప్యూటర్‌ను రూపొందించిన బృందానికి నాయకత్వం వహించింది ఉదయ్‌ రుద్రరాజే. ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ మోడల్‌ ‘గ్రోక్‌ 3’కి శిక్షణ ఇవ్వడంలో కూడా కీలకపాత్ర పోషించారు. గత ఏడాది జూలైలో ఆ సంస్థను వీడి ఓపెన్‌ఏఐలో చేరారు.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 05:53 AM