Share News

ఎప్‌స్టీన్ డార్క్ సీక్రెట్లు నాకు చెప్పాడు.. సంచలన విషయాలను వెల్లడించిన బాధితురాలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:17 PM

సెక్స్ రాకెట్ నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ అకృత్యాలపై సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎప్‌స్టీన్ వల్ల 21 ఏళ్ల వయస్సులోనే తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను రినా ఓహ్ అనే బాధితురాలు వెల్లడించింది.

ఎప్‌స్టీన్ డార్క్ సీక్రెట్లు నాకు చెప్పాడు.. సంచలన విషయాలను వెల్లడించిన బాధితురాలు
Epstein and Survivor

వాషింగ్టన్: సెక్స్ రాకెట్ నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) అకృత్యాలపై సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎప్‌స్టీన్ వల్ల 21 ఏళ్ల వయస్సులోనే తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను రినా ఓహ్ (Rina Oh) అనే బాధితురాలు వెల్లడించింది. ఎప్‌స్టీన్ చేతిలో చిక్కి తాను ఎలా నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చిందో, తనను ఎలా అతను దశాబ్దాలుగా మోసగించాడో, ఎన్ని అవమానాలకు గురిచేశాడో వివరించింది.


ఆరేళ్ల ప్రాయంలో తనకు ఎదురైన వేధింపులు, భయాలతో తాను మౌనంగా ఉండేదాన్నని, ఇది గ్రహించిన ఎప్‌స్టీన్ తనను స్వార్థం కోసం వాడుకున్నాడని రినా తెలిపింది. అప్పుడు తన వయస్సు 21 సంవత్సరాలనీ, తనకు స్కాలర్‌షిప్ ఇప్పిస్తానని చెప్పి ప్లోరిడాలోని ఎప్‌స్టీన్ ఎస్టేట్‌లో బంధించాడని, ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. 21 ఏళ్ల వయస్సులో ముసలిదానిలా ఉన్నావంటూ తరచు అవమానించే వాడని గుర్తు చేసుకుంది. అప్పుడు ఎప్‌స్టీన్ వయస్సు 47 అని తెలిపింది. 21 ఏళ్ల వయస్సులో ఒక అమ్మాయిని ముసలిదానిలా ఉన్నావని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపింది. తనను ఎప్‌స్టీన్ ఎప్పుడూ బ్లాక్‌మెయిల్ చేయలేదని, అయితే తనకు పెర్మనెంట్ నివాసం అంటూ లేకపోయిందని వాపోయింది. తన తల్లిదండ్రుల వివరాలు కూడా అతనికి తెలుసునని, వాళ్లకు హాని చేస్తాడనే భయంతోనే తాను మౌనంగా ఉండిపోయానని చెప్పింది.


ఎప్‌స్టీన్ అతని డార్క్ సీక్రెట్లు కూడా తనకు చెప్పాడని, బాధితులను శారీరకంగా, మానసికంగా కుంగదీసేవాడని, దాని నుంచి కోలుకోవాలంటే వారికి దశాబ్దాలు పడుతుందని రినా తెలిపింది. అతనొక ర్యాగింగ్ నార్సిసిస్ట్ అని పేర్కొంది. చివరిసారిగా ఎప్‌స్టీన్‌ను తాను చూసినప్పుడు అతను ఎంతో వయలెంట్‌గా ఉన్నాడని, ఆ తర్వాత నుంచి అతనితో వెళ్లలేదని, ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదని, ఆ తర్వాత ఎప్పుడూ మాట్లాడింది కూడా లేదని తెలిపింది.


అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండెర్స్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం, కొన్ని గంటలు విచారించిన అనంతరం విడుదల చేయడంపై కూడా రినా స్పందించింది. ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో ఇదొక ఆరంభం మాత్రమేనని అన్నారు. అయితే ఈ కేసులో అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోయని ఆమె అభిప్రాయపడింది. ట్రంప్ పేరు కూడా ఫైళ్లలో ఉన్నందున ఆయన కచ్చితంగా నిజాలు చెప్పాలని అన్నారు. ఈ ఈర్గనైజ్డ్ క్రమినల్ ఎంటర్‌ప్రైజ్‌లో ఎవరి ప్రమేయం ఉందో వారందరినీ బాధ్యులను చేయాలనీ, జవాబుదారీతనం నుంచి అమెరికా ప్రభుత్వం తప్పించుకోరాదని అన్నారు.


ఇవి కూడా చదవండి..

బ్రిటన్‌ రాజు తమ్ముడు ఆండ్రూ అరెస్టు

వారాంతంలో ఇరాన్‌పై అమెరికా దాడి!

Updated Date - Feb 20 , 2026 | 04:35 PM