వారాంతంలో ఇరాన్‌పై అమెరికా దాడి!
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:49 AM
ఈ వారాంతంలో ఇరాన్‌పై అమెరికా దాడికి దిగే అవకాశం ఉందని, ఈ మేరకు ఆ దేశ సైన్యం సన్నద్ధమయ్యిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
వాషింగ్టన్, ఫిబ్రవరి 19: ఈ వారాంతంలో ఇరాన్‌పై అమెరికా దాడికి దిగే అవకాశం ఉందని, ఈ మేరకు ఆ దేశ సైన్యం సన్నద్ధమయ్యిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. బుధవారం వైట్‌హౌ్‌సలో ఉన్నతస్థాయి మిలిటరీ అధికారులతో ట్రంప్ సమావేశమై ఈ అంశం చర్చించారని, అయితే, దాడిపై ఆయన నిర్ణయం తీసుకోలేదని సీఎన్‌ఎన్ మీడియా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆ దేశ ప్రతినిధులతో జెనీవాలో జరిగిన పరోక్ష అధికార చర్చల గురించి ట్రంప్ సలహాదారు జేర్డ్ కుష్నర్, ప్రత్యేక దౌత్యాధికారి స్టీవ్ విట్కాఫ్ ఈ సమావేశంలో వివరించినట్లు తెలిపింది. చర్చల్లో పురోగతి ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం మంచిదని ఇరాన్‌ను వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కెరోలిన్ హెచ్చరించారు.