Share News

పాక్‌లో దారుణం.. పెళ్లింట ఆత్మాహుతి దాడి

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:11 AM

పాక్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఒక పెళ్లింట జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా ఐదుగురు మరణించారు. వీరు మాజీ తాలిబాన్లని పోలీసులు తెలిపారు. ఖైబర్‌పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఈ దారుణం జరిగింది

పాక్‌లో దారుణం.. పెళ్లింట ఆత్మాహుతి దాడి
Pakistan suicide bombing

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో ఓ పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి జరగడం కలకలానికి దారి తీసింది. ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో స్థానిక శాంతిస్థాపన కమిటీ చీఫ్ నూర్ ఆలమ్ మహసూద్ ఇంట ఈ దారుణం జరిగింది. ఘటనలో ఐదుగురు మరణించగా.. 10మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో శాంతిస్థాపన కమిటీ నేత వహీదుల్లా మసూద్ అలియాస్ జిగ్రీ మసూద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు (Suicide Bombing in Pakhtunkhwa).

ఈ పేలుడు ధాటికి నూర్ ఆలమ్ మహసూద్ ఇంటి పైకప్పు కూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారిని వెలికి తీయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు మాజీ తాలిబాన్లు అని పోలీసులు తెలిపారు. హింసను వీడి శాంతిబాట పట్టారని చెప్పారు.


ఈ ఘటనపై ప్రావిన్స్ గవర్నర్ ఫైజల్ కరీమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సవివరమైన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సను అందిస్తున్న జిల్లా ఆసుపత్రి వద్ద హైఅలర్ట్ ప్రకటించారు.


ఇవీ చదవండి:

అందుకే నా చేతికి గాయం అయ్యింది: డొనాల్డ్ ట్రంప్

అమెరికాకు ఇరాన్ హెచ్చరిక.. మాపై దాడి చేస్తే..

Updated Date - Jan 24 , 2026 | 01:06 PM