పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురి మృతి
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:37 PM
పాక్‌లో తాజాగా మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లో తాజాగా మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వాత్ జిల్లాలో శాంతి స్థాపన కోసం జరిగిన ర్యాలీలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 18 మంది గాయపడ్డారు. బాధితులను సహాయక సిబ్బంది ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కొంతకాలంగా ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు జరగడంతో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ స్థానికులు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో దాడి జరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..