పబ్లిక్ ప్లేస్‌లో గుట్కా ఊసిన ఇండియన్స్.. భారీ ఫైన్ వేసిన కోర్టు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:51 PM
పబ్లిక్ ప్లేస్‌లలో పాన్, గుట్కా ఊసిన ఇద్దరు ఇండియన్స్‌కు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఏకంగా 3 లక్షల రూపాయలపైనే ఫైన్ వేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పబ్లిక్ ప్లేస్‌లలో పాన్, గుట్కా ఊసిన ఇద్దరు ఇండియన్స్‌కు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఏకంగా 3 లక్షల రూపాయలపైనే ఫైన్ వేసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ భారతీయుడు కింగ్స్‌బరీ రోడ్‌లో పాన్ ఊశాడు. మరో ఘటనలో ఓ భారతీయుడు క్లారెండన్ గార్డెన్స్ దగ్గర పాన్ ఊశాడు. ఇది గమనించిన అధికారులు వారికి 100 పౌండ్ల (ఇండియన్ కరెన్సీలో 10 వేల రూపాయలు పైనే) చొప్పున ఫైన్ వేశారు. అయితే, వారు 100 పౌండ్ల ఫైన్ కట్టలేకపోయారు. దీంతో అధికారులు వారిని కోర్టుకు తరలించారు.
విచారణ జరిపిన కోర్టు బహిరంగ ప్రదేశాల్లో పాన్, గుట్కా ఊయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లండన్‌లో పబ్లిక్ ప్రదేశాల్లో పాన్ ఊయటం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పబ్లిక్ ప్లేస్‌లలో పాన్ ఊసిన ఇద్దరు భారతీయులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కొక్కరికి 1,391 పౌండ్లు (1.45 లక్షల రూపాయలు) ఫైన్ వేసింది.
ఈ ఘటనపై కేబినెట్ మెంబర్ ఫర్ పబ్లిక్ రియల్మ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కృపా సేత్ మాట్లాడుతూ.. ‘మా వీధులను పాడు చేసే వారిపై కనికరం చూపించం. మేము వేసే ప్రతీ ఫైన్ తప్పు చేసే వారికి ఓ హెచ్చరిక లాంటిది. మా వీధుల్ని మీరు పాడు చేస్తే.. వెతికి పట్టుకుంటాం. మీరు ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ సొమ్మును గతేడాది కంటే ఈ సంవత్సరం రెట్టింపు చేశాం’ అని చెప్పుకొచ్చారు. కాగా.. లండన్ వీధుల్లో పాన్, గుట్కా మరకలు ఉన్న దృశ్యాల తాలూకా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారే ఇలా బహిరంగ ప్రదేశాలను గుట్కా, పాన్ ఊసి పాడు చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
ఈ 3 విషయాల్లో పిసినారితనం పనికిరాదు