98వ అకాడమీ అవార్డ్స్.. నామినేషన్స్‌లో చరిత్ర సృష్టించిన సిన్నర్స్
ABN , Publish Date - Jan 22 , 2026 | 08:39 PM
ఆస్కార్స్ నామినేషన్స్‌లో సిన్నర్స్ సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని ఘనతను సాధించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆస్కార్ అవార్డ్స్ 2026కు సంబంధించి ఈ రోజు (గురువారం) నామినేషన్స్ వెలువడ్డాయి. ఈ సారి నామినేషన్స్‌లో సిన్నర్స్ సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని ఘనతను సాధించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. గతంలో కొన్ని సినిమాలు అత్యధికంగా 14 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించాయి. 1950లో విడుదలైన ‘ఆల్ ఎభౌట్ ఈవ్’, 1997లో విడుదలైన టైటానిక్, 2016 విడుదలైన లా లా ల్యాండ్ సినిమాలు 14 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ మూడు సినిమాల రికార్డులను సిన్నర్స్ తుడిచిపెట్టింది.
సిన్నర్స్ సినిమా నామినేషన్స్ సొంతం చేసుకున్న విభాగాలు ఇవే..
బెస్ట్ సినిమా.
బెస్ట్ డైరెక్టర్ (రయాన్ కూగ్లర్)
యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ ( మైకల్ బీ జోర్డాన్ )
యాక్ట్రెస్ ఇన్ ఏ లీడింగ్ రోల్ ( ఉన్మీ మోసాకు)
యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ ( డెల్ రాయ్ లిండో)
ఒరిజినల్ స్రీన్ ప్లే ( రయాన్ కూగ్లర్ )
కాస్ట్యూమ్ డిజైనర్
క్యాస్టింగ్
ఒరిజినల్ స్కోర్
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్
ఒరిజినల్ సాంగ్ (ఐ లైడ్ టు యు)
ప్రొడక్షన్ డిజైన్
సౌండ్
విజువల్ ఎఫెక్ట్స్
మేకప్ అండ్ హెయిర్ స్టైల్
ఇవి కూడా చదవండి
ఎస్ఐఆర్ వెతలతో కవితా సంపుటి.. మమతా బెనర్జీ
ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ