Share News

Nikita Case: నికిత మర్డర్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:47 PM

నికిత మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీసుకున్న అప్పు తిరిగి అడిగినందుకు అర్జున్ అతి దారుణంగా నికితను చంపేసినట్లు తెలుస్తోంది. అర్జున్ నికితనుంచి 4500 డాలర్లు తీసుకున్నట్లు సమాచారం.

Nikita Case: నికిత మర్డర్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Nikita Case

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలుగమ్మాయి నికిత గోదిశాల మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బు విషయంలో గొడవ కారణంగా నికిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పోలీసులు, నికిత కజిన్ సరస్వతి తెలిపిన వివరాల మేరకు.. అర్జున్ శర్మ నికిత నుంచి ఏకంగా 4500 డాలర్లు అప్పుగా తీసుకున్నాడు. మన కరెన్సీలో అయితే నాలుగు లక్షల రూపాయలకు పైమాటే. అర్జున్ 4500 డాలర్లలో 3500 డాలర్లు తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన 1000 డాలర్లు కూడా తిరిగి ఇవ్వాలని నికిత అడిగింది.


దీంతో అతడు నికిత మర్డర్‌కు ప్లాన్ చేశాడు. డిసెంబర్ 31వ తేదీన నికిత మేరీల్యాండ్ సిటీలోని అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. నికితకు తిరిగి ఇచ్చిన 3,500 డాలర్లను అర్జున్ బెదిరించి అక్రమంగా బదిలీ చేయించుకున్నాడు. తర్వాత అతి దారుణంగా కత్తితో పొడిచిపొడిచి నికితను చంపేశాడు. జనవరి 2వ తేదీన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నికిత కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అదే రోజు అమెరికానుంచి ఇండియాకు పారిపోయాడు. ఇండియాకు పారిపోయే ముందు అర్జున్ ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


డిసెంబర్ 31వ తేదీన నికిత.. అర్జున్ అపార్ట్‌మెంట్ దగ్గర ఉన్నట్లు గుర్తించారు. జనవరి 3వ తేదీన అర్జున్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అర్జున్ ప్లాట్‌‌లో నికిత శవం వెలుగు చూసింది. పోలీసులు అర్జున్‌ను ఇండియానుంచి అమెరికాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, 27 ఏళ్ల నికిత గోదిశాల అమెరికాలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పని చేస్తోంది. ఇల్లీకాట్ సిటీలో ఓ ప్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది.


ఇవి కూడా చదవండి

పాపం.. పెంపుడు పాము ఎంత పని చేసింది.. ఆహారం నోట్లో పెడితే..

పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్

Updated Date - Jan 05 , 2026 | 01:53 PM