హూతీల దాడులు.. మక్కాలో ఎమర్జెన్సీ అలర్ట్
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:43 PM
యెమెన్‌లోని హూతీ మిలిటెంట్ గ్రూప్ సౌదీపై మిసైల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మక్కాతో పాటు జెడ్డాలో ఎమర్జెన్సీ అలర్టులు జారీ అయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌లోని హూతీ మిలిటెంట్ గ్రూప్ సౌదీపై మిసైల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మక్కాతో పాటు జెడ్డాలో ఎమర్జెన్సీ అలర్టులు జారీ అయ్యాయి. సౌదీలోని పశ్చిమ తీరం వెంబడి హూతీలు దాడులు చేస్తుండటంతో సౌదీ ఈ అలర్టులు జారీ చేసింది. ప్రభుత్వ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది. ఈ మధ్య కాలంలో మక్కాలో ఎమర్జెన్సీ అలర్ట్ జారీ కావడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు.
భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 2.58 గంటల సమయంలో ఈ అలర్టులు జారీ అయ్యాయి. ఆ తరువాత రెండు గంటలకు సౌదీ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఎక్స్ వేదికగా మరో ప్రకటన చేసింది. ముప్పు తొలగిపోయిందని చెప్పింది. అయితే, సివిల్ డిఫెన్స్ మార్గదర్శకాలు మాత్రం పాటిస్తూనే ఉండాలని పేర్కొంది. పెద్ద సంఖ్యలో ఒకే చోట గుమిగూడి ఉండవద్దని కూడా ప్రజలకు సూచించింది.
సౌదీ పశ్చిమ తీరం వైపు హూతీలు మిసైల్స్‌ను ప్రయోగించడంతో ఈ అలర్టులు జారీ అయ్యాయని ఓ ఇజ్రాయెల్ పత్రిక పేర్కొంది. ఈ తీరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో మక్కా నగరం ఉంది. మక్కా లో ఎమర్జెన్సీ సైరెన్లు మోగడమంటే ఘర్షణ మరింత ముదిరినట్టేనని కూడా వ్యాఖ్యానించింది.
ఈ వార్తలనూ చదవండి:
హ్యాండిచ్చిన పాక్.. ఇజ్రాయెల్‌ను ఆశ్రయించిన సౌదీ అరేబియా
విమానంలో మహిళ కలకలం.. దుస్తులు విప్పేసి..