లక్ష్మీ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి.. ఇద్దరు కార్మికుల మృతి..
ABN , Publish Date - Aug 17 , 2026 | 08:20 AM
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్వస్థలమైన క్రైవీ రిహ్‌లో ఉన్న ఈ భారీ పారిశ్రామిక సముదాయంపై ఆదివారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది.
క్రైవీ రిహ్: భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్వస్థలమైన క్రైవీ రిహ్‌లో ఉన్న ఈ భారీ పారిశ్రామిక సముదాయంపై ఆదివారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ప్లాంట్‌లోని విద్యుత్ సరఫరా, బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉత్పత్తి కార్యకలాపాలను కొంతమేర నిలిపివేశారు.
నష్టాన్ని అంచనా వేసేందుకు కంపెనీ నిపుణులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఉత్పత్తిని ఎప్పుడు పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దాడి జరిగిన వెంటనే ఒకరు మృతి చెందినట్లు తొలుత సమాచారం వచ్చింది. అనంతరం సహాయక చర్యల్లో మరో మృతదేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వస్థలం క్రైవీ రిహ్ కావడంతో తాజా దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడికి ముందు రష్యాపై ఉక్రెయిన్ భారీగా డ్రోన్లతో విరుచుకుపడింది.
దేశవ్యాప్తంగా ఒక్క రాత్రే 822 డ్రోన్లతో దాడి చేసింది. వీటిలో వందలాది డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో తెలిపింది. ఈ దాడుల్లో పలువురు మరణించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రతిదాడులకు దిగినట్లు పేర్కొంది. కాగా, ఇటీవలి కాలంలో ఇరుదేశాలు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..
జూమ్ కాల్‌లో 900 మందిపై వేటేసిన