ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవు
ABN , Publish Date - May 01 , 2026 | 06:27 AM
ప్రస్తుతమున్న పరిస్థితులలో ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు
మొత్తం ప్రపంచంపై విపరీత ప్రభావం
ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక
గంటన్నర పాటు ఫోన్‌లో మాట్లాడుకున్న నేతలు
మాస్కో/వాషింగ్టన్, ఏప్రిల్ 30: ప్రస్తుతమున్న పరిస్థితులలో ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను స్వాగతించారు. అది సరైన చర్య అని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున ఇరువురు నేతలు గంటన్నర పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషకోవ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే ఏర్పడే పరిణామాలు కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా మొత్తం ప్రపంచంపైనే విపరీత ప్రభావం చూపుతాయని ట్రంప్‌కు పుతిన్ స్పష్టం చేశారని తెలిపారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు చే యకుండా అమెరికా, ఇజ్రాయెల్ సంయమనం వహించాలని కోరినట్టు వెల్లడించారు. మరోవైపు పుతిన్‌తో చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ సంకేతాలు ఇచ్చారని తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. నిజానికి కాల్పుల విరమణకు పుతిన్ ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..