ఇజ్రాయెల్ పౌరులను హమాస్ చంపడం దారుణం.. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ
ABN , Publish Date - Feb 25 , 2026 | 09:49 PM
బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..
‘భారత్, ఇజ్రాయెల్.. ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ఇజ్రాయెల్‌తో 140 కోట్ల భారతీయుల స్నేహం, గౌరవం, భాగస్వామ్యం ఉంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్‌కు పూర్తి అండగా ఉన్నాం. ఉగ్రవాదంతో దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఉగ్రవాదానికి భారత్ పూర్తి వ్యతిరేకం. శాంతిస్థాపన అనేది అంత సులువైన విషయం కాదు. ఉనికి కోసం యూదులు అనేక కష్టాలు పడ్డారు’..
‘ఇజ్రాయెల్‌ను గుర్తించిన 1950లోనే నేనూ జన్మించా. ఇజ్రాయెల్‌తో భారత్‌కు చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ చంపడం దారుణం. ఇజ్రాయెల్ పౌరుల హత్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించం. పాలస్తీనా సమస్యలపై స్పందించాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి వీడాలి. భారత్ ఎప్పుడూ చర్చలు, శాంతినే కోరుకుంటుంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..