Share News

మేయర్‌పై రాకెట్ దాడి.. ప్రాణాల్ని కాపాడిన ఆర్మర్డ్ వాహనం

ABN , Publish Date - Jan 26 , 2026 | 02:27 PM

ఫిలిప్పీన్స్‌లోని ఒక పట్టణ మేయర్ లక్ష్యంగా రాకెట్ దాడి జరిగింది. అయితే మేయర్ ప్రయాణిస్తోన్న ఆర్మర్డ్ వాహనం దాని ప్రభావాన్ని తట్టుకుని ముందుకు సాగడంతో మేయర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దాడి ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మేయర్‌పై రాకెట్ దాడి.. ప్రాణాల్ని కాపాడిన ఆర్మర్డ్ వాహనం
Philippines RPG Attack

ఆంధ్రజ్యోతి, జనవరి 26: ఫిలిప్పీన్స్‌లోని మగుఇండనావో డెల్ సుర్ ప్రావిన్స్‌లోని షరీఫ్ అగ్వాక్ పట్టణ మేయర్ అక్మద్ మిత్రా అంపటువాన్పై లక్ష్యంగా ఆదివారం ఉదయం ఓ భయంకరమైన దాడి జరిగింది. దుండగులు RPG-7(రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్)తో మేయర్ వాహనాన్ని టార్గెట్ చేశారు. కానీ ఆయన ఆర్మర్డ్ టొయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం దాని ప్రభావాన్ని తట్టుకుని ముందుకు సాగడంతో మేయర్ సురక్షితంగా తప్పించుకున్నారు.


దాడి ఎలా జరిగింది?

సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా.. జనవరి 25న(స్థానిక సమయం ప్రకారం ఆదివారం) ఉదయం సుమారు గం. 6:30ల ప్రాంతంలో బరాంగే పోబ్లాసియన్‌లోని మగుఇండనావో స్ట్రీట్ - మేయర్ స్థానిక మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఒక వైట్ మినివాన్ నుంచి ఇద్దరు దుండగులు దిగారు. వారిలో ఒకరు RPG-7 ఫైర్ చేయగా, మరొకరు కాల్పులు జరిపారు. మేయర్ కాన్వాయ్‌పై డైరెక్ట్ హిట్.. ల్యాండ్ క్రూజర్ బాగా దెబ్బతిన్నా, ఆర్మర్డ్ బలంతో వాహనం ఆగకుండా ముందుకు వెళ్లింది. బ్యాకప్ వాహనానికి కూడా బుల్లెట్లు తగిలాయి. ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బంది(బెంజీ డెలోస్ రేయెస్, చీఫ్ మాస్టర్ సార్జెంట్ రే విన్సెంట్ గెర్టోస్)కి గాయాలయ్యాయి. వీరికి డాటు హాఫర్ అంపటువాన్‌లోని బంగ్సమోరో రీజనల్ మెడికల్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు.

ఆ తర్వాత ఏమైంది?

దాడి జరిగిన వెంటనే ఫిలిప్పీన్ నేషనల్ పోలీస్(PNP), ఫిలిప్పీన్ ఆర్మీ(90వ ఇన్ఫాంట్రీ బెటాలియన్) కలిసి హాట్ పర్స్యూట్ ఆపరేషన్ చేపట్టాయి. దుండగుల్ని హతమార్చాయి. ఈ దాడి వెనుక ఉద్దేశమేమిటో ఇంకా తెలియరాలేదు. ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. మేయర్ అక్మద్ అంపటువాన్ షరీఫ్ అగ్వాక్ మీద దాడి జరగడం ఇది నాల్గవ సారి. గత ఐదేళ్లలో ఆయనపై నాలుగు సార్లు దుండగులు హత్యాయత్నం చేశారు. ఆర్మర్డ్ SUV బలంతోనే తన ప్రాణాలు కాపాడుకున్నానని మేయర్ అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం

ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 03:24 PM