ట్రంప్ హత్యకు కుట్రపన్నిన పాక్‌వాసికి యావజ్జీవ ఖైదు
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:31 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర నాయకుల హత్యకు కుట్రపన్నాడన్న కేసులో పాకిస్థాన్‌వాసి అసిఫ్ రజా మర్చంట్(48)కు బ్రూక్లిన్ కోర్టు శుక్రవారం జీవితాంతం జైలులో ఉండేలా...
న్యూయార్క్, మార్చి 7: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర నాయకుల హత్యకు కుట్రపన్నాడన్న కేసులో పాకిస్థాన్‌వాసి అసిఫ్ రజా మర్చంట్(48)కు బ్రూక్లిన్ కోర్టు శుక్రవారం జీవితాంతం జైలులో ఉండేలా శిక్ష విధించింది. అతడు ఇరాన్‌లోని ఐఆర్‌జీసీలో శిక్షణ పొందడం గమనార్హం. 2020లో జరిగిన ఇరానియన్ కాడ్స్ ఫోర్స్ కమాండర్ కాసీం సోలెయ్‌మని హత్యకు ప్రతీకారంగా ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్యసమితిలో అప్పటి అమెరికా రాయబారి నిక్కీ హేలీలను హత్య చేయడానికి కుట్ర పన్నినట్టు కేసు నమోదయింది. అమెరికాలో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు 2024లో ఐఆర్‌జీసీయే అతడిని పంపినట్టు అధికారులు గుర్తించారు. ఇరాన్ పాలకుల ఆదేశంతో అమెరికా భూభాగంలో ఓ రాజకీయ నాయకుడినో, అధికారినో హత్య చేసేందుకు కుట్ర పన్ని ఓ ‘హిట్ మ్యాన్’ను ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి 5వేల డాలర్లు అడ్వాన్సుగా ఇచ్చాడు. దేశం నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. అతడు నియమించుకున్న ‘హిట్ మ్యాన్’ అమెరికా పోలీసు విభాగం గూఢచారి కావడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ