జపాన్‌లో మసీదు నిర్మాణం.. పాక్ కమ్యూనిటీకి రాయబార కార్యాలయం హెచ్చరిక
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:46 AM
జపాన్‌లోని కవాగోయి నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక మసీదు వివాదానికి కారణమైంది. ఈ మసీదు ప్రారంభోత్సవానికి జపాన్‌లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
జపాన్, మే 3: జపాన్‌లోని కవాగోయి నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక మసీదు వివాదానికి కారణమైంది. ఈ మసీదు ప్రారంభోత్సవానికి జపాన్‌లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక చట్టాల ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా మసీదు నిర్మాణం జరిగిందని జపాన్ అధికారులు స్పష్టం చేశారు. వివాదం నేపథ్యంలో జపాన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఆ ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
దీనిపై స్పందించిన జపాన్ లోని పాకిస్థాన్ ఎంబసీ.. నిర్వాహకులు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చి రాయబారిని నమ్మించారని స్పష్టం చేసింది. ఈ అక్రమ ప్రాజెక్ట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ, జపాన్‌లోని పాకిస్థాన్ పౌరులందరూ స్థానిక చట్టాలను కచ్చితంగా గౌరవించాలని, ప్రార్థనా స్థలాల నిర్మాణంలో నిబంధనలు పాటించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.
కాగా, సైతామా ప్రిఫెక్చర్‌లోని కవాగోయిలో ఉన్న ఈ మసీదు, పర్వత అటవీ భూమిగా పరిగణించిన 4,500 చదరపు మీటర్ల స్థలంలో ఉంది. ఈ ప్రదేశం పట్టణీకరణ నియంత్రణ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి స్థానిక అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తే తప్ప సాధారణంగా నిర్మాణం నిషిద్ధం.
ఇవీ చదవండి:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్