బ్రిక్స్ సభ్యత్వానికి పాక్ దరఖాస్తు! కానీ..
ABN , Publish Date - Sep 11 , 2026 | 10:41 PM
బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం పాక్ ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ అభ్యంతరాల నేపథ్యంలో దాయాది దేశం దరఖాస్తు పెండింగ్‌లో ఉండిపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో బలమైన ఆర్థిక కూటమిగా ఎదుగుతున్న బ్రిక్స్‌లో చేరేందుకు పాక్ 2023లోనే దరఖాస్తు చేసుకుంది. అయితే, భారత్ అభ్యంతరాల నేపథ్యంలో పాక్ దరఖాస్తు పరిశీలన ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మధ్య కాలంలో బ్రిక్స్ కూటమిలో కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈలు చేరాయి. భారత్ వీటో నేపథ్యంలో పాక్ అంశం మాత్రం పెండింగ్‌లో పడిపోయింది.
ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ ప్రస్తుతం రుణాల కోసం ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధిపై అధికంగా ఆధారపడుతోంది. ఇతర మార్గాల్లో రుణ లభ్యత పెంచుకునే దిశగా పాక్ బ్రిక్స్‌పై దృష్టిసారించింది. బ్రిక్స్ దేశాల సారథ్యంలో నడిచే న్యూడెవలప్‌మెంట్ బ్యాంకులో 580 మిలియన్ డాలర్ల పెట్టుబడితో వాటా కూడా సాధించింది. ఇక పాక్ సభ్యత్వానికి రష్యా, చైనా ఇప్పటికే మద్దతు తెలిపాయి. అయితే, భారత్ అభ్యంతరాల నేపథ్యంలో పాక్‌కు బ్రిక్స్‌లో చోటు దక్కడం దాదాపు అసాధ్యమని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో బ్రిక్స్ వాటా 49 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, గ్లోబల్ జీడీపీలో బ్రిక్స్ దేశాల వాటా 40 శాతంగా ఉంది. ఇక బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు కూడా 48 శాతం మేర పెరిగి 95.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
వాళ్లకు ఆ పేరు ఎందుకో అర్థం కాదు! పుతిన్ సెటైర్లు
మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు.. పాక్ మందుగుండు సామగ్రి.. అందుకే పేలిందా?