Share News

పక్కా ప్లాన్‌తో రంగంలోకి యూఎస్! ఖమేనీనే లక్ష్యం..

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:30 PM

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కదలికలపై పక్కా సమాచారంతోనే యూఎస్ తన ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పక్కా ప్లాన్‌తో రంగంలోకి యూఎస్! ఖమేనీనే లక్ష్యం..
Operation Epic Fury

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ కదలికలపై సమగ్ర సమాచారంతో అమెరికా రంగంలోకి దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖమేనీ టార్గెట్‌గా అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఆయన కన్నుమూశారు.

మీడియా కథనాల ప్రకారం, శనివారం ఖమేనీ తన కీలక సలహాదారులతో సమావేశం కానున్నట్టు అమెరికాకు తెలిశాక వెంటనే రంగంలోకి దిగింది. అప్పటికే, అమెరికా, ఇజ్రాయెల్ సంస్థలు కొన్ని నెలలుగా ఖమేనీపై నిఘా పెట్టాయి. అధికారిక కార్యాలయాల్లోని ఒక భవనంలో ఈ సమావేశాం జరగనుండటంతో అక్కడ టార్గెట్ చేసేందుకు అమెరికా నిర్ణయించింది. మొత్తం 30 బాంబులతో ఖమేనీ నివాస భవనాలపై ఇజ్రాయెల్ ఫైటర్‌ జెట్లు దాడి చేశాయి. శనివారం మొత్తం మూడు సమావేశాలు జరగనుండగా మొదటి మీటింగ్ సమయంలోనే ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడ్డాయి.


దాడుల కోసం ఏఐ వినియోగం

ఈ దాడుల కోసం ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని కూడా అమెరికా వినియోగించినట్టు తెలుస్తోంది. అయితే, సైనిక అవసరాల కోసం తమ సాంకేతికతను అనుమతించబోమని ఆంథ్రోపిక్ ప్రకటించింది. దీంతో, దీని వినియోగాన్ని దశల వారీగా నిలిపివేసేందుకు అమెరికా నిర్ణయించింది. ఆంథ్రోపిక్‌తో పాటు గూగుల్, ఓపెన్ ఏఐ, ఎక్స్ఏఐ ఏఐ టూల్స్ సేవలను కూడా అమెరికా వినియోగించినట్టు సమాచారం. యుద్ధక్షేత్రంలోని పరిస్థితుల ముదింపు కోసం ఏఐని వినియోగించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఆపరేషన్ ఎపిక్‌ ఫ్యూరీలో భాగంగా అమెరికా తోమహాక్ మిసైళ్లు, హిమార్స్ రాకెట్‌లు, స్టెల్త్ జెట్స్‌ను వినియోగించింది. ఇరాన్ వాడుతున్న చౌకరకం డ్రోన్స్‌ను కూడా అమెరికా వినియోగించింది.


ఈ వార్తలూ చదవండి:

భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ

Updated Date - Mar 01 , 2026 | 07:18 PM