ఎన్విడియా సీఈఓ భవితవ్యం తేల్చనున్న బోర్డు ఆఫ్ డైరెక్టర్స్.. సభ్యురాలిగా భారత మహిళ
ABN , Publish Date - Nov 12 , 2026 | 07:14 PM
ఎన్విడియా సీఈఓ జెన్సన్ భవితవ్యంపై సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బోర్డులో భారత సంతతి మహిళ ఆర్తీ షా కూడా సభ్యురాలిగా ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనా గూఢచారిణిగా అనుమానాలు ఉన్న మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్న ఎన్విడియా సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సంస్థలో ఆయనను కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై సంస్థ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ప్రస్తుతం సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ బోర్డులో సభ్యురాలిగా భారత సంతతి మహిళ ఆర్తీ షా కూడా ఉన్నారు. సీఈఓ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే క్రమంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆర్తీ షా అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది.
ఎవరీ ఆర్తీ షా..
భారత్‌లోనే పుట్టిపెరిగిన ఆర్తీ షా పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్‌లో పీహెచ్డీ (అప్లైడ్ స్టాటిస్టిక్స్) చేశారు. ఆ తరువాత దాదాపు 27 ఏళ్ల పాటు ఫార్మాసుటికల్ దిగ్గజం ఎలీ లిల్లీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రీసెర్చ్, గణాంక విభాగం, బిజినెస్ మేనేజ్మెంట్ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఎల్లీ లిల్లీలో సీనియర్ వైస్ప్రెడిడెంట్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ స్థాయికి చేరుకుని ఆ తరువాత సంస్థను వీడారు. 2020 నుంచీ ఎన్విడియా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఉన్నారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఎన్విడియా ఏర్పాటైంది. సంస్థ వ్యవస్థాపకుల్లో జెన్సన్ హువాంగ్ కూడా ఒకరు. ఒకప్పుడు గేమర్లకు గ్రాఫిక్ కార్డు తయారు చేసే సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ కాలక్రమంలో ఏఐ వెనుక చోదక శక్తిగా మారింది. ఏఐ సంస్థలకు శక్తిమంతమైన కంప్యూటర్ చిప్స్ తయారు చేసే సంస్థగా ఎదిగింది. ఇందులో జెన్సన్ పాత్ర ఎంతో కీలకం. ఆయనపై తుది నిర్ణయానికి రావడం ఎన్విడియాకు అంత సులువు కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..