Share News

నేను వస్తా.. న్యూయార్క్ మేయర్ హెచ్చరికలకు నెతన్యాహు సవాల్..

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:30 PM

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడని, అతడు న్యూయార్క్‌కు వస్తే కచ్చితంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని మమ్దానీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

నేను వస్తా.. న్యూయార్క్ మేయర్ హెచ్చరికలకు నెతన్యాహు సవాల్..
Zohran Mamdani, Benjamin Netanyahu

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడని, అతడు న్యూయార్క్‌కు వస్తే కచ్చితంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని మమ్దానీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తాజాగా నెతన్యాహు తీవ్రంగా తప్పుపట్టారు (Benjamin Netanyahu).


సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు హాజరయ్యేందుకు న్యూయార్క్‌కు తప్పకుండా వస్తానని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజా యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను ప్రస్తావిస్తూ, మేయర్ ఇటీవల నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా పేర్కొన్నారు. ఆయన న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేసే మార్గాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే, ఆ తర్వాత అలాంటి అరెస్టు చేయడానికి నగర పాలక సంస్థకు నేరుగా చట్టబద్ధ అధికారం లేదని కూడా ఆయన అంగీకరించారు (Zohran Mamdani warning).


మమ్దానీ వ్యాఖ్యలపై స్పందించిన నెతన్యాహు, ఆయనది ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమని ఆరోపించారు (ICC arrest warrant). తనపై ఉన్న ఐసీసీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంటూ, వాటిని రాజకీయ ప్రేరేపిత చర్యలుగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాల్గొనేందుకు తాను న్యూయార్క్‌కు వస్తానని, ఎలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 27 , 2026 | 12:32 PM