ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు?
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:54 PM
ప్రభుత్వ ఏర్పాటు క్లిష్టంగా మారిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు జరపాలనే యోచనలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఇతర పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో నెతన్యాహు ఉన్నట్టు ఇజ్రాయెలీ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కూటమి ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయనే నిర్ణయానికి నెతన్యాహు వచ్చినట్టు సమాచారం.
నఫ్తాలీ బెన్నెట్ సారథ్యంలోని టూగెదర్ వర్గం, అవిగ్డోర్ లిబర్‌మెన్ సారథ్యంలోని పార్టీతో జట్టు కట్టేందుకు ప్రణాళికలను కూడా ఇజ్రాయెలీ ప్రధాని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. తన సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష నేత గడీ ఐసెన్‌కాట్ సహకరించరన్న అంచనాకు నెతన్యాహు వచ్చారు. ఈసారి ఎన్నికలు జరిగితే అరబ్ పార్టీల మీధ ఆధారపడే వామపక్ష కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు కూడా నెతన్యాహు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాని విషయం తెలిసిందే. పార్లమెంటులో 120 సీట్లు ఉండగా మెజారిటీ మార్కు 61. ఈ నేపథ్యంలో నెతన్యాహు సార్థథ్యంలోని కూటమికి 53 సీట్లు రాగా, ప్రతిపక్ష నేత గడీ ఐసెన్‌కాట్ కూటమికి 48 సీట్లు వచ్చాయి. అరబ్ సంతతి వారి నేతృత్వంలోని పార్టీలకు 19 సీట్లు వచ్చాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌పై మరో యుద్ధానికి సిద్ధం.. ట్రంప్, నెతన్యాహు మధ్య చర్చలు జరిగాయా..
యూకే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన ఇరాన్