నేపాల్ వరదలు.. మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న నీచుల అరెస్ట్..
ABN , Publish Date - Aug 28 , 2026 | 08:13 AM
నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైరల్ వీడియో ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైరల్ వీడియో ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. భరత్‌పూర్‌లోని పోఖారా బస్ పార్క్‌కు చెందిన 25 ఏళ్ల మదన్ గురాంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీలు.. నారాయణ నదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళ శవాన్ని ఒడ్డుకు లాగారు. శవం జుట్టు పట్టుకుని అతి దారుణంగా కమ్మలు దోచేశారు. దీన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్వాన్ పోలీసులను ఆదేశించారు. చిత్వాన్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. వైరల్ వీడియో ఆధారంగా నిందితులను గుర్తించారు. గురువారం ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వరదల కారణంగా దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిన ఈ క్లిష్ట సమయంలో.. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని దోచుకోవటం లేదా ఇతర అమానవీయ పనులకు పాల్పడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
392కు చేరిన మృతుల సంఖ్య..
నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 392కి చేరింది. దాదాపు 1400 మంది ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 288 మంది భారతీయుల ఆచూకీ లభించలేదని, ఇప్పటి వరకు 200 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఎంఎంటీఎస్ రైళ్లకు ఏసీ కోచ్‌లు!
ఏపీ ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు..