Share News

నేపాల్ వరదలు.. 359కి చేరిన మృతుల సంఖ్య..

ABN , Publish Date - Aug 27 , 2026 | 08:57 PM

నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 359కి చేరినట్లు తెలుస్తోంది. 1300 మంది ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

నేపాల్ వరదలు.. 359కి చేరిన మృతుల సంఖ్య..
Nepal flash floods

ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 359కి చేరినట్లు తెలుస్తోంది. 1300 మంది ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 288 మంది భారతీయుల ఆచూకీ లభించలేదని, ఇప్పటి వరకు 200 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం రెండు సైనిక విమానాలతో 48 టన్నుల ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను పంపిందని వెల్లడించింది.


కాగా, బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన మెరుపు వరదల కారణంగా పలు ఊళ్లు, బ్రిడ్జ్‌లు, ప్రాజెక్ట్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. గల్లంతైన వారిలో 127 మంది నేపాల్ పౌరులు, 517 మంది విదేశీయులు ఉన్నారని నేపాల్ టూరిజం బోర్డు గురువారం తెలిపింది.


ఇవి కూడా చదవండి

న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో చిన్నారులకు 100 బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రి పంపిణీ

ఐఫోన్ 17.. వరల్డ్ టాప్ సెల్లింగ్ ఫోన్!

Updated Date - Aug 27 , 2026 | 09:00 PM