Share News

ఐఫోన్ 17.. వరల్డ్ టాప్ సెల్లింగ్ ఫోన్!

ABN , Publish Date - Aug 27 , 2026 | 08:28 PM

మెమరీ చిప్ రేట్లు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగి డిమాండ్‌లో కోతపడింది. కానీ ఐఫోన్ మాత్రం తగ్గేదేలేదన్నట్టు దూసుకుపోతంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్‌గా ఐఫోన్ 17 నిలిచింది.

ఐఫోన్ 17.. వరల్డ్ టాప్ సెల్లింగ్ ఫోన్!
World's Top Selling Phone -iPhone 17

ఇంటర్నెట్ డెస్క్: మెమరీ చిప్ రేట్లు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగి డిమాండ్‌లో కోతపడింది. కానీ ఐఫోన్ మాత్రం తగ్గేదేలేదన్నట్టు దూసుకుపోతంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్‌గా ఐఫోన్ 17 నిలిచింది. రెండో స్థానంలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, మూడో స్థానంలో ఐఫోన్ 17 ప్రో ఉంది. ఇక ఐఫోన్ 17ఈ 7వ స్థానంలో, ఐఫోన్ 16 10వ స్థానంలో నిలిచింది. టాప్ టెన్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్‌లో ఐదు మోడల్స్ యాపిల్‌వేనని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ ఓ నివేదికలో పేర్కొంది.


మార్కెట్ డౌన్‌లో ఉన్నా ఐఫోన్ జోరు..

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గాయని కౌంటర్‌పాయింట్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలతో అమ్మకాలు తగ్గాయని పేర్కొంది. ఐరోపాలో షిప్‌మెంట్‌లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 10 శాతంమేర తగ్గాయి. చైనాలోనూ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లో కూడా అమ్మకాలు 14 శాతం మేర తగ్గాయి. అయితే, ఐఫోన్ అమ్మకాల్లో మాత్రం జోరు కొనసాగుతోంది.


ప్రపంచవ్యాప్తంగా యాపిల్ యూనిట్ సేల్స్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6 శాతం మేర పెరిగాయి. భారత్‌తో పాటు జపాన్, పశ్చిమాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో విక్రయాలు పెరిగాయి. దక్షిణకొరియాలో ఏకంగా రెండింతలయ్యాయి. అప్‌గ్రేడ్స్ కారణంగా ఐఫోన్ 17, టాప్ మోడల్స్‌ మధ్య వ్యత్యాసం తగ్గింది. ఫలితంగా ఈ మోడల్ అమ్మకాల పరంగా టాప్‌లోకి దూసుకెళ్లింది. ఇక ప్రచార కార్యక్రమాలు, ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్స్, ఈఎమ్ఐ ఆప్షన్స్ కారణంగా యాపిల్ ప్రీమియం ఫోన్ మోడల్స్ విక్రయాల్లోనూ వృద్ధి నమోదైంది.


ఈ వార్తలనూ చదవండి:

ఏఐతో ఉద్యోగాలు ఉఫ్‌!

పెట్‌ ఫుడ్స్‌ విభాగంలోకి విప్రో

Updated Date - Aug 27 , 2026 | 08:36 PM