Share News

ల్యాండింగ్ గేర్ లేకుండానే దిగిన నాసా విమానం.. చెలరేగిన మంటలు..

ABN , Publish Date - Jan 28 , 2026 | 09:28 AM

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'కు చెందిన ఓ రీసెర్చ్ విమానం మంటల్లో చిక్కుకుంది. ల్యాండింగ్ గేర్ లేకుండానే హ్యూస్టన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ల్యాండింగ్ గేర్ లేకుండానే దిగిన నాసా విమానం.. చెలరేగిన మంటలు..
NASA aircraft belly landing

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'కు చెందిన ఓ రీసెర్చ్ విమానం మంటల్లో చిక్కుకుంది. ల్యాండింగ్ గేర్ లేకుండానే హ్యూస్టన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశించినట్టు నాసా వెల్లడించింది (NASA aircraft belly landing).


నాసాకు చెందిన రీసెర్చ్ విమానం ల్యాండ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని హ్యూస్టన్‌లోని ఎల్లింగ్టన్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ సమయంలో ఆ విమానం రన్‌వేపై ఒక వైపునకు వంగిపోయింది. దాంతో విమానం వెనుక భాగం నుంచి మంటలు చెలరేగాయి. విమానాశ్రయంలోని రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు (Houston airport emergency).


విమానం కాక్‌పిట్‌లో ఉన్న పైలెట్‌ను రెస్క్యూ సిబ్బంది కాపాడారు (NASA plane fire). ఈ ఘటనపై నాసా స్పందించింది. ల్యాండింగ్ సమయంలో తమ విమానం ప్రమదానికి గురైనట్టు ధ్రువీకరించింది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశించినట్టు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో అమెరికా భయం.. ఒక డాలర్‌కు 15 లక్షల రియాల్స్..


స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 28 , 2026 | 09:28 AM