అంతరిక్షం నుంచి నైలు నదిని చూడండి.. నాసా వ్యోమగామి ఫొటోలు వైరల్..
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:45 AM
నైలు నదికి సంబంధించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత చిత్రాలను నాసా వ్యోమగామి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నైలు నదికి సంబంధించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి తీసిన అద్భుత చిత్రాలను నాసా వ్యోమగామి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతలకు జీవనాధారంగా నిలిచిన నైలు నది అంతరిక్షం నుంచి మరింత అద్భుతంగా కనిపిస్తోందంటూ ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి (NASA astronaut).
వ్యోమగామి పోస్ట్ చేసిన ఫొటోల్లో ఎడారి మధ్యలో పచ్చని రిబ్బన్‌లా ప్రవహిస్తున్న నైలు నది స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ విస్తరించిన సహారా ఎడారి మధ్యలో ప్రవహిస్తున్న ఈ నది భూమిపై ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఒకటిగా కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'ఏ ఫొటోను ఎంచుకోవాలో అర్థం కావడం లేదు.. అన్నీ అద్భుతంగా ఉన్నాయి', 'ఇది నిజమైన ప్రకృతి కళాఖండం', 'అంతరిక్షం నుంచి భూమి అందం మాటల్లో చెప్పలేం' అని కామెంట్లు చేస్తున్నారు (Nile River from space).
ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదుల్లో ఒకటైన నైలు సుమారు 6,650 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది (NASA Earth photos). ఈ నది ఈశాన్య ఆఫ్రికాలోని పలు దేశాల గుండా ప్రవహిస్తుంటుంది. ముఖ్యంగా ఈజిప్టు వ్యవసాయం, తాగునీరు, నాగరికత అభివృద్ధికి వేల సంవత్సరాలుగా నైలు నది జీవనాధారంగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..