Share News

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. హాజరైన ముగ్గురు కుమారులు

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:00 PM

టెహ్రాన్‌లో ఇవాళ ప్రారంభమైన ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు ఆయన ముగ్గురు కుమారులు హాజరయ్యారు. తండ్రి మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా మాత్రం అక్కడ కనిపించలేదు.

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. హాజరైన ముగ్గురు కుమారులు
Mojtaba Khamenei Skips Ali Khamenei's Funeral in Tehran

టెహ్రాన్ (ఇరాన్)జులై 5: ఇరాన్‌ను సుదీర్ఘకాలం (1989 నుంచి 2026 వరకు) పరిపాలించిన సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తీవ్ర భావోద్వేగాల మధ్య ప్రారంభమయ్యాయి. ఇవాళ (ఆదివారం) టెహ్రాన్‌లోని ప్రసిద్ధ 'ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా' మతపరమైన కాంప్లెక్స్‌లో నిర్వహించిన అధికారిక అంత్యక్రియల ప్రార్థనలకు లక్షలాది మంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ ప్రార్థనల్లో అలీ ఖమేనీ వారసుడు, ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయిన మోజ్తబా ఖమేనీ ఎక్కడా కనిపించలేదు.


శవపేటికల వద్ద కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులు

అంత్యక్రియల ప్రార్థన సమయంలో అలీ ఖమేనీ ముగ్గురు కుమారులు.. ముస్తఫా, మసౌద్, మేసమ్ ఖమేనీ తమ తండ్రి శవపేటిక వెనుక నిలబడి అంజలి ఘటించారు. ఇరాన్ జాతీయ జెండాతో కప్పిన అలీ ఖమేనీ శవపేటికపై ఆయన సాంప్రదాయ నల్లటి తలపాగాను ఉంచారు. ఫిబ్రవరిలో జరిగిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు మరణించిన ఆయన కుమార్తె బుష్రా, కోడలు, అల్లుడు, 14 నెలల వయసున్న మనవరాలి శవపేటికలను కూడా పక్కపక్కనే ఉంచారు. ప్రార్థనల సమయంలో ఖమేనీ కుమారుడు మసౌద్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.


ఈ కార్యక్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిదీ తదితర కీలక నేతలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 04:05 PM