Share News

సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ క్షేమం!

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:51 AM

ఇరాన్‌ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ (56) క్షేమంగా, ఆరోగ్యంగానే ఉన్నారు! ఆ దేశాధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ కుమారుడు, ప్రభుత్వ సలహాదారు యూసెఫ్‌...

సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ క్షేమం!

టెహ్రాన్‌, మార్చి 11: ఇరాన్‌ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ (56) క్షేమంగా, ఆరోగ్యంగానే ఉన్నారు! ఆ దేశాధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ కుమారుడు, ప్రభుత్వ సలహాదారు యూసెఫ్‌ పెజెష్కియన్‌ బుధవారం ‘టెలిగ్రామ్‌’లో ఈ విషయం వెల్లడించారు. గత నెల 28న అమెరికా-ఇజ్రాయెల్‌ దాడిలో అప్పటి సుప్రీం లీడర్‌ అయతుల్లా ఆలీ ఖమేనీ, ఆయన భార్య, కోడలు చనిపోయిన సంగతి తెలిసిందే. అదే సందర్భంగా మొజ్తాబా కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఆలీ ఖమేనీ స్థానంలో ఆయన్ను ఆదివారమే సుప్రీం నేతగా ప్రకటించినా.. ఇంతవరకు మొజ్తాబా ప్రజలనుద్దేశించి ప్రసంగించలేదు. బహిరంగంగా కనిపించనూలేదు. దీంతో ఆయన ఉనికిపై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై యూసెఫ్‌ తన పోస్టులో స్పష్టత ఇచ్చారు. ‘మొజ్తాబా గాయపడినట్లు వచ్చిన వార్తలపై.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు మిత్రులను అడిగాను. అల్లా దయ వల్ల ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వారు ధ్రువీకరించారు’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Updated Date - Mar 12 , 2026 | 05:51 AM