సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు.. ఇరాన్ అధికారిక ప్రకటన
ABN , Publish Date - Mar 09 , 2026 | 08:01 AM
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఆయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.
టెహ్రాన్, మార్చి 9: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఆయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆదివారం ఆయనను సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 కింద మొజ్తాబాను ఇరాన్‌కు మూడవ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. ఈ మేరకు ఖమేనీ మీడియా ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. మొజ్తాబా ఎన్నికను ధ్రువీకరించింది. ఇకపై ఇరాన్ దేశం తీసుకునే ప్రతీ నిర్ణయంలో సుప్రీం లీడర్ హోదాలో మొజ్తాబా మాటే ఫైనల్ అవ్వనుంది.
ట్రంప్, ఇజ్రాయెల్ వార్నింగ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న (ఆదివారం) ఇరాన్‌కు ఓ వార్నింగ్ ఇచ్చారు. కొత్త సుప్రీం లీడర్ అమెరికా అనుమతి తీసుకోవాలని, లేదంటే ఎక్కువ రోజులు ఆ పదవిలో(ప్రాణాలతో ఉండరని చెప్పకనే చెప్పారు) ఉండరని ట్రంప్ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరైనా.. అతడు తమ నెక్స్ట్ టార్గెట్ అని తేల్చి చెప్పారు. అతని పేరు ఏదైనా.. ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.
ఖమేనీ మృతితో..
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తాత్కాలిక సుప్రీం లీడర్ ఇరాన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆదివారం మొజ్తాబా అధికారికంగా సుప్రీం లీడర్ పదవికి ఎన్నికయ్యారు. దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి మొజ్తాబా రెండవ కుమారుడు. తండ్రి సుప్రీం లీడర్ కావటంతో మొజ్తాబాకు రెవల్యూషనరీ గార్డ్స్‌తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆయన గుప్పిట్లోనే ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పదవి లేకపోయినప్పటికి తండ్రి తరఫున మొజ్తాబా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న కారణంతో 2019లో యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆయనపై ఆంక్షలు సైతం విధించింది.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?