ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశం
ABN , Publish Date - Sep 11 , 2026 | 09:57 PM
ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీలో నేడు సమావేశమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీలో నేడు సమావేశమయ్యారు. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. వివిధ అంతర్జాతీయ వేదికల్లో ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశం అనంతరం ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మాట్లాడుతూ బ్రిక్స్ కూటమి బలం కేవలం సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకే పరిమితం కాలేదని అన్నారు. వాణిజ్య నెట్‌వర్క్‌ల ఏర్పాటు, పెట్టుబడులు, ఉమ్మడిగా నిధుల సమీకరణలో బ్రిక్స్ దేశాల సామర్థ్యాలు మరింత స్పష్టం అవుతున్నాయని అన్నారు.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం సంక్లిష్టంగా మారాయని ఆయన అన్నారు. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, ఆర్థిక సాధనాలతో రాజకీయ ఒత్తిళ్లు పెంచడంతో పరిస్థితి క్లిష్టంగా మారిందని చెప్పారు. ఈ సవాళ్లను బ్రిక్స్ దేశాలు ఎలా ఎదుర్కోవాలన్నదే బ్రిక్స్ దేశాల ముందున్న సవాలని పేర్కొన్నారు.
న్యూఢిల్లీకి బయలుదేరే ముందు కూడా ఇరాన్ అధ్యక్షుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకపక్ష ధోరణులను ఎదుర్కోవడమే బ్రిక్స్ లక్ష్యం కావాలని అన్నారు. ఈ లక్ష్యానికి బ్రిక్స్ మరింత చేరువ కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత సమావేశాల నినాదం కూడా ఈ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక సవాళ్ల పరిష్కారానికి కొత్త విధానాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
వాళ్లకు ఆ పేరు ఎందుకో అర్థం కాదు! పుతిన్ సెటైర్లు
మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు.. పాక్ మందుగుండు సామగ్రి.. అందుకే పేలిందా?