Share News

మెలానియా జోక్యం..యుద్ధంలో కాస్త విరామం

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:34 AM

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ జోక్యం కారణంగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో మంగళవారం ఓ చోట ప్రాంతీయ కాల్పుల విరమణ అమలయింది

మెలానియా జోక్యం..యుద్ధంలో కాస్త విరామం
melo

మైకోలైవ్‌ (ఉక్రెయిన్‌), అక్టోబరు 27: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ జోక్యం కారణంగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో మంగళవారం ఓ చోట ప్రాంతీయ కాల్పుల విరమణ అమలయింది. ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్‌ నగరం ఒలెష్కీలో మానవతా సహాయం అందించేందుకు ఆమె ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ నగరంలో 2వేల మంది వృద్ధులు ఉండగా, యుద్ధం వల్ల వారికి ఎలాంటి ఆహారం, మంచినీరు, మందులు అందడం లేదు. ఈ అంశం ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావనకు రావడంతో మెలానియా స్పందించారు. మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించారు. ఆమె కార్యాలయం సిబ్బంది ఉభయ దేశాలతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న ప్రజలను ఈ నెల 29 నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా సన్నాహాలు చేశారు. దాంతో అంతవరకు కాల్పులు విరమణ కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

Updated Date - Oct 28 , 2026 | 05:34 AM