మోదీకి వ్యతిరేకంగా.. సీజేపీకి అమెరికన్ల నిధులు!
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:12 AM
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సీజేపీకి, దాని అధ్యక్షుడు దీప్కేకు కొందరు అమెరికన్ డోనర్లు నిధులిస్తున్నారని అమెరికాకు చెందిన సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు
అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
వాషింగ్టన్, అక్టోబరు 14: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సీజేపీకి, దాని అధ్యక్షుడు దీప్కేకు కొందరు అమెరికన్ డోనర్లు నిధులిస్తున్నారని అమెరికాకు చెందిన సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు. ఆ పార్టీపై భారతీయ యువత శాంతియుతంగా ఉద్యమించాలని పిలుపిచ్చారు. ప్రధాని మోదీకి మద్దతుగా నిలవాలని బుధవారం ‘ఎక్స్’లో కోరారు. ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదని.. విఘాతకర శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ‘కొందరు అమెరికన్ డోనర్లు ప్రపంచవ్యాప్తంగా మితవాద నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలో చదువుకున్నవారిని గుర్తించి.. వారిని ర్యాడికలైజ్ చేసి.. మాతృదేశాలకు పంపి.. అక్కడ ఆందోళనలు, గందరగోళం సృష్టించేందుకు నిధులు సమకూరుస్తున్నారు’ అని తెలిపారు. అయితే మిల్లీ తన ఆరోపణలకు ఆధారాలను చూపలేదు. కాగా, మోదీకి మిల్బెన్ గట్టి మద్దతుదారు.
ఈ వార్తలు కూడా చదవండి
పోప్ లియోకు క్యాన్సర్.. ఆయన అన్నకు కూడా
శ్వేతసౌధం కొత్త ప్రెస్ సెక్రటరీ తడబాటు.. ఊహించని మిస్టేక్..