Share News

రెండేళ్ల న్యాయ పోరాటం.. పెంపుడు మొసలిపై ఆశలు వదిలేసుకున్న యజమాని..

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:20 PM

టోనీ కావెల్లారో తన పెంపుడు మొసలి కోసం చేస్తున్న న్యాయ పోరాటానికి స్వప్తి పలికాడు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి నేపథ్యంలో మొసలిని వదులుకోవటానికి సిద్ధమయ్యాడు.

రెండేళ్ల న్యాయ పోరాటం.. పెంపుడు మొసలిపై ఆశలు వదిలేసుకున్న యజమాని..
emotional support alligator

న్యూయార్క్, ఏప్రిల్ 12: అమెరికాకు చెందిన టోనీ కావెల్లారో తన పెంపుడు మొసలి కోసం చేస్తున్న న్యాయ పోరాటానికి స్వప్తి పలికాడు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి నేపథ్యంలో మొసలిని వదులుకోవటానికి సిద్ధమయ్యాడు. న్యూయార్క్‌కు చెందిన టోనీ కావెల్లారో 30 ఏళ్ల నుంచి ఇంట్లోని ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌లో ఆల్బర్ట్ అనే మొసలిని పెంచుకుంటున్నాడు. మొసలిని అతడు పెంచుకోవడానికి అధికారులు ఇచ్చిన పర్మీషన్ 2021లో ముగిసింది. పర్మీషన్ ముగిసినా అతడు మాత్రం మొసలిని అధికారులకు అప్పగించలేదు.


ప్రమాదకరమైన జంతువును అధికారుల పర్మీషన్ లేకుండా ఉంచుకోవటమే కాకుండా.. దానితో ఆడుకోవటానికి, కలిసి ఈత కొట్టడానికి స్థానికులకు అవకాశం కల్పించేవాడు. ఈ విషయం తెలుసుకున్న ‘ది న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ కన్సర్వేషన్’ అధికారులు 2024లో మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తన పెంపుడు మొసలిని స్వాధీనం చేసుకోవటంపై టోనీ న్యాయ పోరాటం మొదలెట్టాడు. రెండేళ్లు గడిచిపోయాయి. 66 ఏళ్ల టోనీ తాజాగా న్యాయ పోరాటాన్ని ఆపేయాలని డిసైడ్ అయ్యాడు.


కేసు కారణంగా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు తప్పటం లేదని అంటున్నాడు. టోనీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘వాళ్లు నా మొసలిని వెనక్కు తిరిగి ఇవ్వరని నాకు తెలుసు. న్యాయ పోరాటం కొనసాగించటం వల్ల నాకు మరింత డబ్బు నష్టం అవుతుంది. మానసిక ఒత్తిడి తప్పదు. అందుకే న్యాయపోరాటాన్ని ఆపేస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. మొసలి దూరం అవ్వటంతో టోనీ మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. ప్రస్తుతం ఆల్బర్ట్ టెక్సాస్‌లోని రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డ్..

బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌లో మోసం.. రూ.6.5 కోట్ల గోల్‌మాల్..

Updated Date - Apr 12 , 2026 | 09:23 PM