Share News

బహ్రెయిన్‌లో వేడుకగా శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవం

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:24 AM

గల్ఫ్‌ దేశాల్లో ఏటా జరిగే శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు బహ్రెయిన్‌లో శుక్రవారం వైభవంగా జరిగాయి.

బహ్రెయిన్‌లో వేడుకగా  శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాల్లో ఏటా జరిగే శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు బహ్రెయిన్‌లో శుక్రవారం వైభవంగా జరిగాయి. తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేదపండితులు రాఘవాచార్యులు, శ్రీనివాసచార్యులు, ఆర్‌. శ్రీనివాసన్‌ స్వామి, శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కల్యాణ మహోత్సవంలో బహ్రెయిన్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతర్‌ దేశాలలోని సుమారు 200 మందికి పైగా తెలుగు కుటుంబాల వారు పాల్గొన్నారు. మరో వేయిమంది స్వామివారిని సేవించారు.

సుప్రభాత సేవతో మొదలయిన కార్యక్రమం రాత్రి ఏకాంతసేవతో ముగియగా....స్వామిని కీర్తిస్తూ వివిధ రకాల అధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు పరవశించిపోయారు. కల్యాణోత్సవంలో భారత రాయబారి ప్రదీప్‌ సింగ్‌ రాజ్‌ పురోహిత్‌, ఆయన సతీమణి మంజు పాల్గొన్నారు. పస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యం నెలకొనాలని శ్రీవేంకటేశ్వరుని ప్రార్థించినట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Nov 16 , 2026 | 05:24 AM