ఎల్‌ఈటీ సహవ్యవస్థాపకుడిపై కాల్పులు.. పరిస్థితి విషమం
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:40 PM
పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ఎల్‌ఈటీ సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై లాహోర్‌లో కాల్పులు జరిగాయి. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా సహవ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై (66) లాహోర్‌లో గురువారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హమ్జా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
నగరంలోని ఒక న్యూస్ ఛానల్ కార్యాలయం బయట ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అతడిపై కాల్పులు జరిపిన అనంతరం నిందితులు పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన హమ్జాను ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎమరీ హమ్జా?
అఫ్గాన్ జీహాదీ గ్రూపులకు చెందిన హమ్జా 1980ల్లో మరో ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో కలిసి ఎల్‌ఈటీని స్థాపించాడు. భారత్‌తో పాలు ఇతర దేశాల్లో దాడులకు హమ్జా సూత్రధారిగా ఉన్నాడు. తన ప్రసంగాలు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే రచనలతో గుర్తింపు పొందాడు. ఎల్‌ఈటీ పత్రికకు వ్యవస్థాపక ఎడిటర్‌గా కూడా కొంతకాలం పాటు కొనసాగాడు. ఎల్‌ఈటీ గ్రూపు కీలక నాయకుల్లో ఒకడిగా ఉన్నాడు. ఉగ్రవాదులను చేర్చుకోవడం, నిధుల సమీకరణ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడని సమాచారం. ఎల్‌ఈటీని విదేశీ టెర్రరిస్టు సంస్థగా అమెరికా ఇప్పటికే ప్రకటించింది. హమ్జాను కూడా టెర్రరిస్టుగా పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
షాకిచ్చిన యూఎస్.. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు
చైనా శాటిలైట్‌తో యూఎస్ స్థావరాలపై ఇరాన్ నిఘా!