అల్లాకు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది.. ఖమేనీ ఎక్స్ హ్యాండిల్‌లో ఖురాన్ పోస్ట్..
ABN , Publish Date - Mar 01 , 2026 | 08:55 AM
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ తర్వాత ఇరాన్ మీడియా ధ్రువీకరించింది.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ తర్వాత ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఆ తర్వాత ఖమేనీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఖురాన్ నుంచి ఒక అరబిక్ సూక్తితో కూడిన పోస్ట్ ప్రత్యక్షమైంది (Khamenei last message X).
'అపార కరుణామయుడు అయిన అల్లా నామస్మరణలో కొందరు పురుషులు ఉన్నారు. వారు అల్లాతో చేసిన ఒప్పందానికి నిజాయితీగా నిలిచారు. వారిలో కొందరు తమ ప్రతిజ్ఞను (ప్రాణత్యాగంతో) పూర్తిచేశారు. మరికొందరు ఇంకా ఎదురుచూస్తున్నారు. వారు తమ ఒప్పందాన్ని ఎప్పటికీ మార్చుకోలేరు' అంటూ ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. 1989 నుంచి ఇరాన్‌ను నడిపించిన సుప్రీం లీడర్, 86 ఏళ్ల ఖమేనీ వీడ్కోలును ఈ పోస్ట్ సూచిస్తోంది. ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం 40 రోజులు సంతాప దినాలు, 7 రోజులు సెలవు దినాలు ప్రకటించింది (Iran Supreme Leader Quran post).
అమెరికా, ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు ఖమేనీని నిర్మూలించడానికి ఖచ్చితమైన దాడి చేశాయని శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు (US Israel Iran conflict). ఇరాన్ ఉగ్రవాద పాలన నేటితో ముగిసిందని, ఖమేనీ కుటుంబం నాశనమైందని, అజేయ కూటమికి ధన్యవాదాలని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు చనిపోయినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలితో పాటు కోడలు కూడా మరణించినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..